Begin typing your search above and press return to search.
జగన్ కీలక నిర్ణయం..మే 26 నుంచి విశాఖ నుంచే ఏపీ పాలన!
By: Tupaki Desk | 19 March 2020 2:54 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ లో చాలా కాలం నుంచి ఎడతెగని చర్చ సాగుతున్న మూడు రాజధానులపై వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఫుల్ క్లారిటీతో ముందుకు సాగుతున్నారని చెప్పాలి. ఏపీకి మూడు రాజధానులు... అందులో లెజిస్లేటివ్ కేపిటల్ గా అమరావతి - ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ - జ్యుడిషియల్ కేపిటల్ గా కర్నూలును ప్రకటించేసిన జగన్ ఆ దిశగా ఇప్పటికే కీలక అడుగులు వేశారు. వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ బిల్లు రద్దుకు సంబందించి ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం దక్కేలా చూసిన జగన్... శాసన మండలిలో మాత్రం అడ్డంకి ఎదురు కావడంతో... దానికి కూడా విరుగుడు కనిపెట్టేలా పకడ్బందీ ప్లాన్ రచించుకున్నారనే చెప్పాలి. ఆ ప్లాన్ మేరకే మే నెల 26 నుంచి విశాఖ నుంచి ఏపా పాలనను సాగించాలని కూడా ఆయన ఫుల్ క్లారిటీతో కూడిన నిర్ణయం తీసుకున్నారన్న వాదన ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ దిశగా జగన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పక్కా అంచనాలేమిటన్న విషయానికి వస్తే... మే 25 నాటికి వికేంద్రీకరణ చట్టం అమలులోకి వస్తుందని జగన్ సర్కార్ అంచనాగా తెలుస్తోంది. అదెలాగంటే... జనవరి 22న వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి అడ్డుకున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం నాలుగు నెలల కాలంలో కౌన్సిల్ ఆమోదం లేకున్నా ఆ బిల్లు చట్ట రూపుదాల్చే అవకాశం ఉందందన్న విషయం తెలిసిందే. అది మే 25 నాటికి పూర్తవుతుంది కదా. ఇక ఈ దిశగా ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు కూడా ఆ నాటికి తొలగుతాయని వైసీపీ ప్రభుత్వ పెద్దల భావనగా తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 26 నుంచి విశాఖ నుంచే పాలనను సాగించాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా చర్చ సాగుతోంది.
జగన్ ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రభుత్వ పెద్దల ద్వారా తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు... మే నెలాఖరు నాటికి విశాఖకు తరలిపోవాల్సిందేనన్న అంశంపై ఓ అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగా బుధవారం జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇదే విషయాన్ని తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల ద్వారా ఉద్యోగులకు చేరవేశారని తెలుస్తోంది. మే నెలాఖరు నాటికి విశాఖకు తరలిపోక తప్పదన్న సందేశాన్ని ఇస్తూనే... విశాఖకు తరలే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులన్నింటిని కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సిద్దంగా ఉందని కూడా వెంకట్రామిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా డీఏ గానీ, రుణాలు గానీ, విద్యా సంస్థల్లో ఉద్యోగుల పిల్లలకు అడ్మిషన్లు గానీ... మొత్తంగా ఏ ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉందని, ప్రభుత్వానికి మనం కూడా సహకరించక తప్పదన్న మెసేజ్ ను వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు చేరవేశారు. మొత్తంగా చూస్తుంటే... మే 26 నుంచి విశాఖ నుంచే ఏపీ పాలన సాగేలా జగన్ పకడ్బందీ ప్లాన్ రచించినట్టుగా తెలుస్తోంది.