Begin typing your search above and press return to search.
సాక్షి వాదనలోకి 'ఈనాడు'ను తెచ్చిన జగన్
By: Tupaki Desk | 21 March 2017 6:13 PM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. పాడిందే పాడరా అన్నట్లుగా.. అదే పనిగా విపక్ష నేత వైఎస్ జగన్ పై ఏదో విధంగా దుమ్మెత్తి పోసే ప్రయత్నాన్ని చేశారు ఏపీ అధికారపక్ష నేతలు. గతంలో పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని అదే పనిగా మరోసారి తెర మీదకు తెచ్చారు టీడీపీ తమ్ముళ్లు.
జగన్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన టీడీపీ నేతలకు.. వైఎస్ జగన్ ఇచ్చిన సమాధానంతో డిఫెన్స్ లో పడిపోయారు ఏపీ అధికారపక్ష నేతలు. సాక్షి వాటాల్ని అధిక లాభాలకు అమ్మి..వందల కోట్లు లాభపడినట్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనికి రియాక్ట్ అయిన జగన్.. టీడీపీ నేతలు ఎవరూ ఊహించని రీతిలో చేసిన వ్యాఖ్యలకు నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది.
సాక్షి పేరుతో జగన్ ను ఇబ్బంది పెట్టాలనుకున్నతెలుగు తమ్మళ్లకు షాకిచ్చేలా.. ఈనాడు ప్రస్తావన తీసుకొచ్చిన జగన్ తీరుతో ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్ గా ఉండిపోయారు. టీడీపీ నేతల ఆరోపణలకు స్పందించిన జగన్.. సాక్షి ఇప్పుడు దేశంలోఎనిమిదో స్థానంలో ఉన్నసంస్థ అని.. కావాలంటే రికార్డులు చెక్ చేసుకోవాలన్నారు.
‘‘ఈనాడు అనే సంస్థ వంద రూపాయిల షేరు ఒక్కొక్కటి అక్షరాల రూ.5.26లక్షలకు అమ్మారు. రూ.1800 కోట్ల నష్టంతో ఉన్న ఈనాడు సంస్థకు అంత విలువ కడితే.. ఈనాడు విలువతో పోలిస్తే.. అందులో సగం ధరకే సాక్షి ఇన్వెస్టర్లకు షేర్లు ఇచ్చింది. ఇందులో ఎక్కడా స్కాం లేదు. ఇన్వెస్ట్ చేసినోళ్లంతా మంచోళ్లే. వారంతా లాభాల్లోనే ఉన్నారు. ఈనాడులో ఇన్వెస్ట్ చేసినోళ్లు నష్టపోలేదు. సాక్షిలో ఇన్వెస్ట్ చేసినోళ్లు నష్టపోవాలా? సభను తప్పు దోవ పట్టించే మాటలు ఎందుకు? నేను చెప్పింది అబద్ధమైతే రికార్డుల్ని చెక్ చేసుకోండి’’ అంటూ మండిపడ్డారు. దీంతో.. తెలుగు తమ్ముళ్లు సాక్షిని వదిలేసి.. జగన్ ఆస్తుల వైపు ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/