Begin typing your search above and press return to search.
జగన్ లేటయినా లేటెస్టుగా వస్తున్నాడే!
By: Tupaki Desk | 13 Jun 2016 5:21 AM GMTఒకింత రాజకీయ గందరగోళంలో పడిపోయిన వైఎస్సార్ సీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆ పరిస్థితి నుంచి నెమ్మదిగా తేరుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే భావనతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఏపీ పరిపాలన రాజధానిగా విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయంగా పట్టుబిగిస్తుండటం, ఉద్యోగుల తరలింపులో కూడా పైచేయి సాధించడం, అమరావతి పరిసర ప్రాంతాల్లో భూ కుంభకోణాలు - కుల రాజకీయాలు పెరుగుతున్న పరిణామాలను గమనించిన జగన్ - హైదరాబాద్ లో ఉండటం కంటే విజయవాడ కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటివరకూ వైసీపీ కార్యకలాపాలు - ముఖ్యుల సమావేశాలు - నిర్ణయాలన్నీ హైదరాబాద్ నుంచే వెలువడిన సంగతి తెలిసిందే. అయితే సచివాలయ ఉద్యోగులు కూడా విజయవాడకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో - సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నందున అందుకు అనుగుణంగా తన వ్యూహం మార్చుకున్నారు. రాజధాని అమరాతి నుంచే రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేయాలని నిర్ణయించారు.
అదే సమయంలో మూడేళ్ల ముందుగానే ఎన్నికల ప్రచారానికి జగన్ తెరలేపనున్నారు. అందులో భాగంగానే గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ నినాదాన్ని అందుకుంటున్నారు. అధికార టీడీపీ ప్రలోభపెడుతున్న క్రమంలో నియోజకవర్గ స్థాయిలో కొంత స్తబ్దత నెలకొంది. దీంతో ఎవరు ఉంటారో, ఎవరు వెళతారో తెలియని గందరగోళ పరిస్థితి. ఈ గందరగోళానికి తెరదింపి - పార్టీ నేతలు - శ్రేణులను నిరంతరం జనంలోనే ఉండేలా జగన్ ఈ కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా వైఎస్ జయంతి సందర్భంగా జులై 8 నుంచి గడప గడపకూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లో విస్తృత స్థాయి సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏకబిగిన నిర్వహించనున్నారు. పైకి ఇది సాధారణంగా రాజకీయ పార్టీ నిర్వహించే కార్యకర్తల చైతన్య కార్యక్రమంగా కనిపిస్తున్నప్పటికీ, దాని వెనుక సుదీర్ఘ రాజకీయ లక్ష్యం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే - ఇంచార్జి - నగర - పట్టణ - గ్రామ కోఆర్డినేటర్లు తన నియోజకవర్గ పరిధిలోని పట్టణ - మండల - గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి - బాబు అవినీతి పాలనలో జరిగిన లక్షా44 వేల కోట్ల అవినీతికి సంబంధించి ముద్రించిన కరపత్రాన్ని స్వయంగా అందచేయాలి. వారితో మాట్లాడాలి. దీనికి కాలపరిమితి అంటూ లేదు. ఒక నాయకుడు తన నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తట్టాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుంటారు. సదరు నాయకుడు ఇంటింటికీ వెళుతున్నారా లేదా అన్న అంశంపై సొంత మీడియా ప్రతినిధులతోపాటు - ప్రైవేటు సర్వే సంస్థల ప్రతినిధుల పర్యవేక్షణ ఉంటుంది.
ఇందుకోసం జగన్ వేసిన లెక్క సైతం ఆసక్తికరంగా ఉంది. ఒక నాయకుడు నియోజకవర్గంలోని ప్రతి తలుపు తట్టాలంటే కనీసం రెండు - మూడు నెలలు పడుతుంది. ఎన్నికల సమయంలో అయితే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే ప్రచారం చేయవలసి ఉంటుంది. కానీ ఇలా అయితే, ఎక్కువ వెసులుబాటు లభిస్తుందని జగన్ ఎత్తుగడగా చెప్తున్నారు. బాబు అవినీతి పాలనపై తాము ముద్రించిన కరపత్రం చదివితే, అందులో 40 శాతం తటస్థుల్లో మార్పు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధిస్తామన్న అంచనా ఈ కార్యక్రమ రూపకల్పనలో కనిపిస్తోంది. జగన్ లక్ష్యం కూడా అదేనని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఒకరకంగా ఇది మూడేళ్లకు ముందునుంచే ఎన్నికల ప్రచారంలా భావించవచ్చని విశ్లేషిస్తున్నారు.