Begin typing your search above and press return to search.
నడక వేగం..ఎన్నికలే గమ్యం...
By: Tupaki Desk | 20 Dec 2018 4:39 AM GMTఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు - వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను మరింత వేగంగా ముగించనున్నారా...? మరో నాలుగు నెలల్లో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ - లోక్ సభ ఎన్నికల బరిలో పూర్తి స్ధాయిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకంటున్నారా...? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి జనవరి 20వ తేదీ నాటికి తన పాదయాత్రను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముందు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పాదయాత్రను పూర్తి చేయాలని - మధ్యలో నిలివేయకూడదని భావిస్తున్నారంటున్నారు. దీంతో ప్రస్తుతం రోజుకు ఎనిమిది - తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఇది ముందుగా నిర్దేశించిన లక్ష్యం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తూండడం - తెలుగుదేశం పార్టీ టిక్కట్ల పంపిణీ వంటి సన్నాహాలు చేయడానిక సమాయత్తమవడంతో పాదయాత్రను వీలైనంత తర్వగా పూర్తి చేయాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ముందుగా జిల్లాల వారీగాను - ఆ తర్వాత నియోజకవర్గాల వారీగాను సమీక్షలు జరపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
పాదయాత్రను సంక్రాంతి పండగనాటికి పూర్తి చేసి ఎన్నికల వేడి పుట్టించాలన్నది జగన్ మోహన్ రెడ్డి యోచన. లోక్ సభ - శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు రావడం - ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేయాలనుకోవడంతో ఇక అభ్యర్ధుల ఎంపిక - ప్రచారం వంటివి ముమ్మరం చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం వివిధ విభాగాలను ఏర్పాటు చేసి వారి ద్వారా ఎన్నికల ప్రక్రియకు నాంది పలకాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. ముందుగా సమీక్షలు నిర్వహించడం - తర్వాత అభ్యర్ధుల ఎంపిక - సిట్టింగుల్లో ఎవరికి ఇవ్వాలి - ఎవరిని నిలిపివేయాలి వంటి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే టిక్కట్ల పంపిణీకి ముందే ఆశావాహులతో సమావేశాలు నిర్వహించడం - టిక్కట్ దక్కని వారిని ముందుగానే బుజ్జగించడం వంటివి చేయాలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నాురు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పని చేయాలని - గ్రూపులకు - వివాదాలకు అభ్యర్ధులందరూ దూరంగా ఉండాలని కూడా జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ - పవన్ కల్యాణ్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ ఉండడంతో విజయం దగ్గరకు వచ్చి దూరమైపోయిందని - ఈసారి వారిద్దరు తెలుగుదేశం పార్టీతో లేరు కాబట్టి విజయం తమకే దక్కుతుందని పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడిపైనా - ఆయన ప్రభుత్వం పైనా విపరీతమైన వ్యతిరేకత ఉందని - దీనిని వాడుకోవాలని కూడా జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. మొత్తానికి జనవరి మూడో వారంలో పాదయాత్ర ముగింపు - ఎన్నికల సన్నద్ధం ప్రారంభమవుతాయని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.