Begin typing your search above and press return to search.

9 మంది ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్‌ కు టెన్ష‌న్‌..!

By:  Tupaki Desk   |   12 March 2016 6:24 AM GMT
9 మంది ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్‌ కు టెన్ష‌న్‌..!
X
తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స‌క్సెస్ ఫుల్‌ గా జ‌రుగుతుంటే ఇప్పుడు ఏపీలో కూడా ఈ ఆప‌రేష‌న్ అదిరిపోయే రీతిలో స్టార్ట్ అయ్యింది. ఇప్ప‌టికే వైకాపా నుంచి 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. మ‌రో ఎమ్మెల్సీ కూడా కండువా క‌ప్పేసుకున్నారు. కర్నూలు జిల్లాలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేర‌డంతో స్టార్ట్ అయిన ఈ ఆప‌రేష‌న్‌ లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ - కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి - బద్వేలు ఎమ్మెల్యే జయరాములు - ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు - విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక క‌డ‌ప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. రేపోమాపో శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ కూడా సైకిలెక్క‌నున్నారు.

ఈ లెక్క ఇలా ఉంటే ఇప్పుడు మ‌రో 9 మంది ఎమ్మెల్యేలు కూడా సైకిలెక్కేందుకు రెడీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆ జాబితా వైకాపా అధినేత జ‌గ‌న్ వ‌ద్ద ఉంద‌ని జ‌గ‌న్ వారితో ఫోన్ సంభాష‌ణ‌లు చేసి బుజ్జ‌గించి...భ‌విష్య‌త్తు మ‌న‌దే అని చెప్పినా వారు నుంచి స‌రైన రిప్లే రాలేద‌ని తెలుస్తోంది. దీంతో జ‌గ‌న్ విందు స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ వారిని మెత్త‌బ‌డేలా చేసిన ప్ర‌య‌త్నాలు కూడా విఫ‌ల‌మ‌య్యాయ‌ట‌. ఇక తాజాగా టీడీపీలోకి రెండో విడ‌త‌లో జంప్ అయ్యే జాబితాలో కర్నూలు జిల్లాలో మరో ఇద్దరు - ప్రకాశం జిల్లాలో ఇద్దరు - నెల్లూరు జిల్లాలో ఒకరు - గుంటూరు జిల్లాలో ఇద్ద‌రు - విశాపట్టణంలో ఒకరు - కృష్ణాలో ఒకరు మొత్తం తొమ్మిది మంది తెలుగుదేశంలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు.

వీరంతా టీడీపీలోకి వస్తారనే సమాచారం ఉన్నప్పటికీ కొన్ని హామీలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తిరిగి టికెట్ ఇవ్వటం, నియోజకవర్గంలో పనుల కాంట్రాక్టులు తమ వారికే ఇచ్చే విధంగా హామీ ఇవ్వటం, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం వంటి హామీల కోసం ఆ తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ‌చ్చే నెల 4వ తేదీలోగా ఈ తొమ్మ‌ది మంది ఎమ్మెల్యేల‌తో చాలా మంది టీడీపీలోకి జంప్ అయిపోతార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే వీరు టీడీపీలోని ఓ గ్రూప్‌ తో ట‌చ్‌ లో ఉన్నార‌ని వారి ద్వారా అధికార‌పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే విష‌యంలో సీక్రెట్‌ గా వ్య‌వ‌హారాలు న‌డుపుతున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ లో రెండో విడ‌త‌లో భాగంగా వైకాపాలో మ‌రో భారీ కుదుపు ఖాయ‌మ‌ని తేల‌డంతో జ‌గ‌న్‌ కు ఇప్పుడు ఆ తొమ్మ‌ది మంది ఎమ్మెల్యేల‌ను ఎలా కాపాడుకోవాల‌న్న టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌.