Begin typing your search above and press return to search.

కరోనా రోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   2 Aug 2020 3:30 AM GMT
కరోనా రోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్
X
ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే కేసులు ఏకంగా రోజుకు 10వేలు దాటుతున్నాయి. ఇప్పటికే మొత్తం కేసులు ఏపీలో లక్షన్నర దాటేశాయి. పరీక్షలు బాగా చేస్తుండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఈ క్రమంలోనే సీఎం జగన్ కరోనా నివారణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఒక వెబ్ పోర్టల్ సిద్దం చేయించారు. ఇందులో ఏపీలోని కరోనా సోకిన ప్రజలు చికిత్స కోసం వివిధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల ప్రత్యక్ష స్థితిని అందులో చూడవచ్చు. తద్వారా తమకు నచ్చిన ఆస్పత్రిలో కరోనా చికిత్స చేయించుకునే వీలుంది.

ప్రస్తుతం ఏపీలో మొత్తం 4211 ఐసీయూబెడ్స్ ఉన్నాయి. అందులో 1697 బెడ్స్ వినియోగంలో ఉండగా.. 2514 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆక్సిజన్ బెడ్స్ 10211 ఖాళీగా ఉన్నాయి. 11603 జనరల్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. 1172 వెంటీలేటర్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇలా జిల్లాల వారీగా ఆస్పత్రుల్లో బెడ్స్ వివరాలను రోజూ అప్ డేట్ చేస్తూ ఏపీ ప్రజలు ఉన్నతమైన చికిత్స పొందేలా ఈ పోర్టల్ ను వినియోగిస్తున్నారు.