Begin typing your search above and press return to search.
కేసీఆర్ బాటలో జగన్.. సంచలన నిర్ణయం.?
By: Tupaki Desk | 12 Sep 2019 7:31 AM GMTకేసీఆర్ బాటలో ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ తో ఈ విషయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే జనవరి 26కు దీని ముహూర్తం కూడా పెట్టినట్టు సమాచారం.
ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేస్తానని.. సంస్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్ పగ్గాలు చేపట్టాక చాలా పెండింగ్ పనులు - హామీలను పూర్తి చేశారు. అయితే ఈ అతిపెద్ద జిల్లాల విభజనకు కూడా శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
బుధవారం గవర్నర్ తో సీఎం జగన్ మాట్లాడినట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న విసయాన్ని సీఎం జగన్ ఏపీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారట.. పాలనలో సంస్కరణలకు సులభంగా అమలు చేసేందుకు జిల్లాల విభజన అవసరాన్ని గవర్నర్ కు జగన్ నొక్కి చెప్పినట్టు సమాచారం.జిల్లాల పునర్విభజనతో పాలనలో కొత్త ఒరవడి, వికేంద్రీకరణ సేవలకు దోహదపడుతుందని జగన్ అభిప్రాయపడినట్టు తెలిసింది.
కాగా ఈ జిల్లాల విభజనను నాలుగు నెలల్లో పూర్తి చేయడానికి జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర్య దినోత్సవ వేడుకల నాటికి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొచ్చేలా జగన్ సర్కారు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.