Begin typing your search above and press return to search.
వైసీపీలో కలకలం.. జగన్ మరో సంచలనం.!?
By: Tupaki Desk | 10 July 2019 5:56 AM GMTవరుస సాహస నిర్ణయాలతో షేక్ చేస్తున్న ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయ్యారన్న వార్త కలకలం రేపుతోంది.. పోలవరం టెండర్లను రద్దు చేసేందుకు నిర్ణయించారని సమాచారం. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉనప్పుడు వైఎస్ జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక జగన్ పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై నిపుణుల కమిటీని తేల్చిందని సమాచారం.
పోలవరం అవినీతిపై జగన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా పోలవరం అవినీతిపై సంచలన సిఫార్సులు చేసింది. పోలవరం ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని సూచించింది. ప్రధాన కాంట్రాక్టును రద్దు చేస్తే ఉప కాంట్రాక్టులు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది. 2005లో పోలవరం టెండర్లు పిలిచిన నాటి నుంచి జరిగిన అవినీతిపై ఈ కమిటీ సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. పనులను రద్దు చేసి రీటెండరింగ్ కు వెళ్లాలని జగన్ కు సూచించింది. అదే సమయంలో ఈ గొప్ప ప్రాజెక్టును ఆగకుండా జగన్ త్వరగా పూర్తి చేయించాలని కోరింది.
సీఎం కిరణ్ హయాంలో 2013లో పోలవరం టెండర్లను ట్రాన్స్ ట్రాయ్ సంస్థ టెండర్ల ద్వారా దక్కించుకుంది. 14శాతం తక్కువకే కోట్ చేసి పనులు మొదలు పెట్టింది. ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఎల్ అండ్ టీ - బావర్ - త్రివేణి - కెల్లర్ - బెకం సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ట్రాన్స్ ట్రాయ్ నుంచి కీలక పనులను నవయుగ సంస్థకు ఇచ్చింది. 4000 కోట్ల విలువైన పనులను అప్పగించింది. ట్రాన్స్ ట్రాయ్ దివాళా తీసిన తరువాత కూడా కొనసాగించారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక పోలవరం టెండర్లలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. టెండర్లలో అక్రమాలు నిగ్గు తేల్చింది కమిటీ. రీ టెండరింగ్ కు వెళ్లడానికి సిద్ధమైంది. త్వరలోనే పోలవరం టెండర్లను జగన్ ప్రభుత్వం రద్దు చేయనున్నారు.
అయితే పోలవరం టెండర్ల రద్దు మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా ఈ ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరీ.