Begin typing your search above and press return to search.
మండలి మూతపై జగన్ మాటకు మోడీషాలు కన్వీన్స్ అవుతారా?
By: Tupaki Desk | 25 Jan 2020 7:04 AM GMTచేతిలో అధికారం ఉండి.. ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందన్నది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న వారికో వ్యూహం ఉంటుంది. విజన్ ఉంటుంది. దానికి తగినట్లుగా ప్రయారిటీలను సెట్ చేసుకుంటూ ముందుకెళుతుంటారు. అలా వెళుతున్న వారిని ఏదో ఒక ఎత్తులతో ఎదురు దెబ్బలు తగిలేలా చేసినప్పుడు కొందరు ఓపికతో తమదైన టైం కోసం వెయిట్ చేస్తే.. మరికొందరు మాత్రం దూకుడు గా నిర్ణయాలు తీసుకుంటారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో కోవ కు చెందిన వ్యక్తి. తన చేతిలో అధికారంలో ఉన్న తర్వాత కూడా కుయుక్తులతో.. కుట్రల తో దెబ్బ తీయాలనుకున్న వారికి సూటిగా తలపడాలన్న తీరు బాగానే ఉన్నా.. బాబు లాంటి సీనియర్ నేతతో పెట్టుకునేటప్పుడు ఆచితూచి అన్నది అస్సలు మిస్ కాకూడదు. అలా మిస్ అయినందుకే.. మండలి లో రాజధాని బిల్లు సెలెక్ట్ కమిటీ వరకూ వెళ్లిందని చెప్పాలి.
మండలిలో తనకున్న బలాన్ని అసరా చేసుకొని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బాబు కు దిమ్మ తిరిగి పోయేలా షాక్ ఇచ్చేందుకు ఏకంగా మండలినే మూయిస్తే పోలా అంటూ అసలుకే ఎసరు పెట్టే విషయాన్ని తెర మీదకు తెచ్చేశారు. శషబిషలు లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేసే తీరు చాలా తక్కువ మంది పాలకులకు ఉంటుంది. ఆ కోవకు చెందిన జగన్.. మండలి విషయంలో తన అభి మతానికి తగ్గట్లు కేంద్రాన్ని ఒప్పిస్తారా? అన్నది ప్రశ్న. ఒకవేళ.. జగన్ మాటకు మోడీషాలు ఓకే చెప్పినా.. మండలి మూత అంత సులువు కాదన్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. రాజ్యసభలో ఎన్డీయేకు ఉన్న బలం అంతంతమాత్రమే. మండలి మూత విషయం లో రాజ్యసభ లో కాంగ్రెస్ తో సహా మిగిలిన పార్టీలు అంత తేలిగ్గా ఒప్పుకునే వీలు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మండలి విషయం లో మోడీషాలు మాత్రమే కాదు.. విపక్షాల్ని ఒప్పించాల్సి ఉంటుందన్నది జగన్ గుర్తిస్తే మంచిదని చెప్పక తప్పదు.