Begin typing your search above and press return to search.

పీకేకి ప్యాకేజి ఇస్తున్న జగన్...?

By:  Tupaki Desk   |   27 Oct 2022 6:37 AM GMT
పీకేకి ప్యాకేజి ఇస్తున్న జగన్...?
X
పీకే ప్యాకేజి అంటే వేరేగా అనుకుంటారేమో. పీకే అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, 2019 ఎన్నికల్లో ఏపీని రాజకీయంగా తీవ్రంగా ప్రభావితం చేసిన మరో పీకే ఉన్నారు. ఆయనే ప్రశాంత్ కిశోర్. ఆయనకు కూడా ప్యాకేజిలు బాగానే వెళ్తున్నాయట. ఆయన వైసీపీకి అత్యంత సన్నిహితుడు. ఆ మాటకు వస్తే ఆయన రాజకీయ వ్యూహకర్తకు మించి జగన్ కి అని చెబుతారు. ప్రశాంత్ కిశోర్ జగన్ సీఎం కావడానికి తనదైన వ్యూహాలను అమలు చేశారు. 151 సీట్లతో జగన్ గెలిచారు. ఆ కృతజ్ఞత జగన్ కి ఉంది. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మరోమారు విజయఢంకా మోగించడానికి ప్రశాంత్ కిశోర్ నే పెట్టుకున్నారు.

ఆయన ఐ ప్యాక్ టీం ఇపుడు ఏపీలో వైసీపీకి చురుకుగా పనిచేస్తోంది. సోషల్ మీడియా లో పోస్టింగుల నుంచి సర్వేలు, ఎన్నికల వ్యూహాలు ఎవరిని ఎక్కడ ఉంచాలి, దించాలి ఇలా ఇత్యాది అనేక రకాల రాజకీయ చదరంగం అంతా పీకే ఐ ప్యాక్ టీం స్ట్రాటజీల నుంచే పుట్టుకువస్తాయి. ఇదిలా ఉండగా పీకే అనబడే ప్రశాంత్ కిశోర్ కూడా రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నారు. అందరినీ సీఎం లను చేసిన తాను బీహార్ కి సీఎం కాకూడదా అని ఈ బీహారీ బాబు ఒకానొక శుభ ముహూర్తాన తలచాడు.

అందుకే ఆయన జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి పాదయాత్ర మొదలెట్టారు. ఆయన రోడ్లు కొలుస్తూ మైళ్ళకు మైళ్ళు తిరిగుతూ బీహార్ అంతటా పాదయాత్ర చేస్తుననరు. మరి ఆయన పాదయాత్రకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అన్నదే ఇపుడు అందరికీ పట్టుకున్న పెద్ద డౌట్. అయితే కొందరు బీజేపీ ఇస్తోందని ప్రచారం చేయడం మొదలెట్టారు. మొదట్లఒ నరేంద్ర మోడీ తో కూడా పీకే గుడ్ రిలేషన్స్ కొనసాగించారు. దాంతో బీహార్ లో ఇపుడు అధికారంలో లేని బీజేపీ ఓట్ల చీలిక కోసం పీకే ద్వారా కొత్త పార్టీ పెట్టించి రాజకీయ ఆట అడిస్తోంది అని అందరూ డౌట్ పడుతున్నారు

అయితే తన పైన వస్తున్న ఈ తహరా ఆరోపణలు అన్నీ తప్పు అని పీకే ఖండిస్తున్నారు. తనకు బీజేపీ డబ్బులు ఇవ్వడమేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను వ్యూహకర్తగా పనిచేసి ఆరుగురుని సీఎంగా చేశానని, వారి నుంచే తనకు నిధులు అందుతున్నాయని చెబుతూ అందులో జగన్ పేరుని కూడా ఆయన ప్రస్థావించారు. నిజానికి చూస్తే పీకే సేవలను మిగిలిన సీఎంలు వాడుకున్నా ఇపుడు వారంతా ఆయనకు దూరంగా ఉంటున్నారు. జగన్ ఒక్కడే ఐ ప్యాక్ సేవలను 2024 దాకా వాడుకునేందుకు ఒప్పదం పెట్టుకున్నారు. ఆ విధంగా చూస్తే జగన్ నుంచే ఎక్కువగా నిధుల సాయం పీకేకు అందుతోంది అని అంటున్నారు.

రోజుకు ఇరవై లక్షలకు తక్కువ కాకుండా పీకే పాదయాత్రకు ఖర్చు అవుతోందిట. ప్రచార పటాటోపాలు సోషల్ మీడియా పోస్టింగులతో పాటు ఇతరత్రా ఖర్చులు అన్నీ భారీ లెవెల్ లో ఉన్నాయట. మరి అంత డబ్బు ఆయనకు ఖర్చు అవుతూంటే కోట్ల రూపాయలు ఎవరు ఇస్తున్నారు అన్నది ఇపుడు తెలిసిపోయింది అని విపక్షాలు అక్కడా ఇక్కడా కూడా అంటున్నారు. ఏపీలో వేసుకఒవడానికి చిన్న రోడ్డుకు కూడా నిధులు లేవని కానీ రాజకీయ వ్యూహకర్తలకు, సలహాదారులకు ఇవ్వడానికి మాత్రం కోట్ల రూపాయలు ఉన్నాయా అని జగన్ సర్కార్ మీద విమర్శలు వస్తున్నాయి.

అయితే ఇదంతా పార్టీ ఫండ్ గా చూపిస్తారు. వాటికి లెక్కలు ఒక పట్టాన తెమలవు కాబట్టి ఇది సర్కార్ సొమ్ము అని అనడానికి ఉండదు, పైగా ఇందులో కూడా వైట్ ఎంత బ్లాక్ ఎంత అన్నది కూడా లెక్కలు ఉండవు కాబట్టి బీహార్ లో విపక్షాలు అయినా ఏపీలో ప్రతిపక్షాలు అయినా డిమాండ్ చేసినా ఫలితం ఉండదని ఈ లెక్కలు ఎపుడూ బయటపడవని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.