Begin typing your search above and press return to search.

షర్మిలకు జగన్ గౌరవం.. కీలక పదవి

By:  Tupaki Desk   |   26 Sep 2019 11:21 AM GMT
షర్మిలకు జగన్ గౌరవం.. కీలక పదవి
X
పార్టీ, ప్రభుత్వం రెండు కళ్లు.. మొన్నటి ఎన్నికల ముందర టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని పట్టించుకొని పార్టీని వదిలేయడంతో చివరకు ఓటమి ఎదురై ఆయన ప్రతిపక్షంలోకి పడిపోయారు. అందుకే ఈ తప్పును చేయకూడదని వైసీపీ అధినేత - సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఏపీలో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్న జగన్ ఇప్పుడు పార్టీని అదే స్థాయిలో కాపాడుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కోవలోనే కేసీఆర్ బాటలో నడవాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది..

రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి కొడుకు కేటీఆర్ ను మంత్రివర్గానికి దూరంగా ఉంచి పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు. కేటీఆర్ సారథ్యంలోనే ఎన్నికలను ఎదుర్కొన్నారు. కేసీఆర్ పూర్తిగా పాలనపై దృష్టిసారించారు.

ఇప్పుడు జగన్ కూడా ఏపీ సీఎంగా కీలక బాధ్యతలతో బిజీగా ఉన్నారు. 2012లో జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రతో పార్టీని ఆయన చెల్లెలు షర్మిల కాపాడారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. అందుకే వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలిసింది. జగన్ పూర్తిగా ప్రభుత్వాన్ని చూసుకుంటూ వైసీపీ బాధ్యతలను షర్మిలకు ఇచ్చేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

జగన్ 2012లో జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి వైసీపీని కాపాడారు. గడిచిన ఎన్నికల్లోనూ టీడీపీ మంత్రులు - కీలక నేతల నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వైసీపీకి బూస్ట్ ఇచ్చారు. టీడీపీ నేతలను అదిరిపోయే విమర్శలతో ముప్పుతిప్పలు పెట్టారు. అందుకే తాజాగా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షర్మిలను జగన్ నియమించబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. పార్టీకి సమయం కేటాయించలేకపోతున్న జగన్ ఈ మేరకు తన చెల్లెలును వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి న్యాయం చేయాలని చూస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.