Begin typing your search above and press return to search.
ఆ నేతకు ఎమ్మెల్సీ... అడ్డొస్తోన్న ఈక్వేషన్లు...!
By: Tupaki Desk | 11 Aug 2019 7:44 AM GMTరాజకీయాలకు అదృష్టానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంటుందని అంటారు పరిశీలకులు. కొందరు నాయకులను గమనిస్తే.. ఇది నిజమేనని అనిపిస్తుంది. తనకు తిరుగులేదని - తనదే రాజ్యమని అనుకున్న నాయకులు కూడా చతికిలపడిన సందర్భాలు నేటి రాజకీయాల్లో కోకొల్లలు. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే - కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసిపి సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్. 2009 - 2014 ఎన్నికల్లో ఆయన టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. దీంతో పట్టుబట్టి అయినా సరే.. సర్వశక్తులు వడ్డి అయినా కూడా 2019లో విజయం సాధించి - జగన్ కు కానుకగా ఇవ్వాలని కలలు కన్నారు.
ఆయనపై జగన్ కు అపారమైన నమ్మకం కూడా ఉంది. అందుకే ఆయన ఎన్నికల్లో ఓడినా జగన్ జిల్లా పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగించారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ కోసం ఆయన రెండు - మూడేళ్లుగా ఎంతో శ్రమించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. ఇక టిక్కెట్ తనదే అని... తనకు తిరుగులేదని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా దురదృష్టం ఆయనను వెతుక్కుంటూ విడదల రజనీ రూపంలో సాక్షాత్కరించింది. టిడిపి నుంచి పోటీ చేయాలని అనుకున్న ఆమె అనూహ్యంగా తన రాజకీయ ప్రవేశాన్ని వైసీపీ వైపు మళ్లించారు. దీనికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
వాస్తవానికి టిడిపి నుంచి కమ్మ సామాజిక వర్గం నాయకుడు ప్రత్తిపాటి బలంగా ఉండడంతో ఇక్కడ మర్రి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అనుకున్నారు. అయితే, జగన్ నిర్ణయంతో ఆయన వెనక్కి తగ్గక తప్పలేదు. నిజానికి వైఎస్ ఫ్యామిలితో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. అదే సమయంలో జగన్ కోసం ఆయన అనేక త్యాగాలు కూడా చేశారు. అయినప్పటికీ.. జగన్ నిర్ణయమే శిరోధార్యంగా అయినా భావించి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే జగన్ ఆయనకు తన ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, అనూహ్యంగా సామాజిక ఇంజనీరింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో ఓసీలను ఎక్కువగా తీసుకోకుండా ఇతర కులాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో మర్రి ఆశలు ఆవిరయ్యాయి.
అలా తొలి కేబినెట్ లో మర్రికి చోటు రాలేదు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల జాతరకు తెరలేచింది. మొత్తంగా మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి తనకు ఖచ్చితంగా దక్కుతుందని మరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయితేనే కదా భవిష్యత్తులో ఆయనకు మంత్రి పదవి వచ్చేది.
అయితే, ఇప్పుడు మర్రి ఎమ్మెల్సీ ఆశలు కూడా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే మంత్రి అయినా మోపిదేవి వెంకటరమణ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో ఓడిపోయారు. దీంతో ఈయనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక, రెండు స్థానాల్లోనూ ఒకటి ఎస్సీలకు రిజర్వ్ చేశారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరొకటి రాజుల కోటాకు ఇవ్వాలని చూస్తున్నారు. దీనికి జగన్ రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఒక్క స్థానాన్ని మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కుమారుడు పీవీవీ సూర్యనారాయణ రాజుకు ఇవ్వనున్నట్టు సమాచారం. ఒకవేళ మైనార్టీ కోటాలో ఇవ్వాలనుకుంటే హిందూపూర్ లో బాలయ్యపై ఓడిన మహ్మద్ ఇక్బాల్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో మర్రికి ఇప్పట్లో ఎమ్మెల్సీ దక్కడం సాధ్యం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.