Begin typing your search above and press return to search.
వైఎస్ జగన్ మంత్రివర్గ ఏర్పాటు ఆ రోజా!
By: Tupaki Desk | 26 May 2019 5:46 AM GMTఈ నెల ముప్పైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలా ఇరవై మూడు నిమిషాలకు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. మే ముప్పైన జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయన కేబినెట్ ప్రమాణ స్వీకార ముహూర్తం మరో రోజు అని సమాచారం.
గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారని, ఆయన కేబినెట్ అంతా తర్వాత ప్రమాణ స్వీకారం చేసిందని జగన్ కూడా అదే రీతిన బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారని సమాచారం. ముందుగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని, తదుపరి కేబినెట్ అంతా జూన్ ఏడో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ముందుగా జగన్ తో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు కొందరు ఆ తర్వాత మరి కొందరు అనే విశ్లేషణ వినిపించింది. అయితే అలా విడతల వారీగా కంటే.. కేబినెట్ అంతా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తే బెటరని… జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నారని, జూన్ ఏడో తేదీన మొత్తం కేబినెట్ చేత జగన్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.