Begin typing your search above and press return to search.
బాబు మూడేళ్ల అవినీతి లెక్క తేల్చారు
By: Tupaki Desk | 8 July 2017 4:05 AM GMTఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఒకసంచలన పుస్తకం ఈ రోజు విడుదల కానుంది. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో.. ఆయన అవినీతి ఎంతన్నది లెక్క తేలుస్తూ.. ఈ రోజు (శనివారం) ఒక పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.
గుంటూరులో షురూ కానున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదిక మీద బాబు అవినీతి లెక్క తేల్చే పుస్తకాన్ని విడుదల చేస్తారు. మూడేళ్ల క్రితం అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ జులై 5 వరకు ఆయన నేతృత్వంలోని సర్కారు చేసిన అవినీతికి సంబంధించిన సంచలన లెక్కలు ఇందులో ఉండనున్నాయి.
అవినీతి చక్రవర్తి పేరుతో గతేడాది బాబు అవినీతిపై లెక్కలు చెబుతూ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. అదే పుస్తకాన్ని అప్ డేట్ చేసి తాజాగా విడుదల చేయనున్నారు. మొత్తం 56 కుంభకోణాలకు సంబంధించి రూ.3.75 లక్షల మేర అవినీతి చోటు చేసుకున్నట్లు తాజా లెక్క తేల్చనున్నట్లు తెలుస్తోంది. రాజధాని భూములు మొదలుకొని విశాఖ భూముల కుంభకోణాలు.. బినామీల భూ భాగోతాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయిందన్న ఆరోపణలకు బలం చేకూరే లెక్కలు ఈ పుస్తకంలో ఉంటాయని చెబుతున్నారు. ఈ పుస్తకం విడుదలయ్యాక.. ఇందులోని అంశాలు సంచలనంగా మారతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.