Begin typing your search above and press return to search.
ఢిల్లీకి జగన్.. ప్రధానితో సమావేశం..ఎందుకంటే..?
By: Tupaki Desk | 5 Dec 2019 9:45 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. నేటి సాయంత్రం నాలుగున్నరకు ఆయన ఢిల్లీ బయల్దేరనున్నట్టుగా తెలుస్తోంది. కియా పర్యటనలో అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ సారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ప్రధాని మోడీని కలవబోతున్నట్టుగా తెలుస్తోంది.
రేపు ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారని సమాచారం. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరి కొందరు మంత్రులను కూడా జగన్ కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23 కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, జనవరి 9 అమ్మఒడి కార్యక్రమాలను ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ప్రధానిని జగన్ ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది.
ఉక్కు కర్మాగారం ఏర్పాటులో కేంద్రం పాత్ర కూడా ఉంది. అలాగే సంచలన రీతిలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు జగన్ ప్రధానిని ఆహ్వానించనున్నారని సమాచారం.
అలాగే కేంద్రమంత్రులను కూడా కలిసి వివిధ అంశాల గురించి చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఏపీలో రాజకీయ వాడీవేడీ ప్రకటనల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతూ ఉంది.