Begin typing your search above and press return to search.
టీడీపీపై బీజీపీకి కంప్లయింట్ చేయనున్న వైసీపీ
By: Tupaki Desk | 18 April 2016 9:02 AM GMTఏపీలో ఫిరాయింపుల రచ్చ ఢిల్లీకి పాకనుంది. పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై వేటు వేయించేందుకు ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేయాలని జగన్ అనుకుంటున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ ఇటీవల ఫిరాయింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకొనేందుకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని రూపిందించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించే తన పార్టీ ఎమ్మెల్యేలపై చర్యల కోసం ఇక హస్తీనలోనే తేల్చుకోవాలని వైసీపీ నిర్ణయించింది. త్వరలోనే ఆ పార్టీ బృందం ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అవుతోంది. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలుమార్లు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. అదే సందర్బంలో విప్ ను దిక్కరిస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయోచ్చన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ పైనా - స్పీకర్ పైనా వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.. అంతేకాకుండా ద్రవ్య వినుమయ బిల్లు ఆమోదం సమయంలో ఆ బిల్లుపై ఓటింగ్ కు వైసిపి పట్టుబట్టి ఓటింగ్ నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు కోసం విప్ ను జారీ చేసేందుకు వీలుగా వైసీపీ ఇన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
దీంతో వైసీపీ ఇప్పుడు కేంద్రంపై ఆశలు పెట్టుకుంటోంది. అడ్డుగోలుగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేయకుండా కేంద్రంలోని ఎన్ డిఏ సర్కార్ ఇటీవల కొద్దికాలం కిందట తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని వాడుకోవాలని చూస్తోంది. ఈ చట్టం ప్రకారం తన పార్టీనుంచి టిడిపిలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లో జగన్ - వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని - ప్రధాని నరేంద్రమోడీని - ఇతర ప్రధాన పార్టీల నేతలను - కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలవాలని అనుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టిడిపి వలసలను ప్రోత్సహిస్తోందని, ఇప్పటి వరకు పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఢిల్లీలో రాష్ట్రపతి - ప్రధాని - కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరాలని అనుకుంటున్నారు