Begin typing your search above and press return to search.

ఏపీలో జగన్‌ ఇల్లు ఎలా ఉండబోతోందో తెలుసా..?

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:15 PM GMT
ఏపీలో జగన్‌ ఇల్లు ఎలా ఉండబోతోందో తెలుసా..?
X
వైసీపీ అధినేత జగన్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లోని తన స్వగృహంలో ఉంటున్నారు. పార్టీ మీటింగ్స్‌ కానీ - వ్యక్తిగత కార్యక్రమాలు కానీ అన్నీ లోటస్‌ పాండ్‌ నుంచే ఆపరేట్‌ చేస్తున్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్ వచ్చి జగన్‌ని కలిసింది లోటస్‌ పాండ్‌ లోనే. అయితే.. ఏపీలో ప్రతిపక్షనేతగా ఉంటూ.. హైదరాబాద్‌ లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పటికే టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. దీనికితోడు మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతుంది. దీంతో.. విజయవాడ దగ్గరలోని తాడేపల్లి గ్రామంలో అన్ని వసతులతో ఒక ఇల్లు కట్టుకుంటున్నారు జగన్‌.

తాడేపల్లి గ్రామంలో సువిశాల స్థలంలో జగన్‌ కు సంబందించిన ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఇంటిలోకి ప్రవేశించగానే.. మొదటగా మనకు పార్టీ అఫీస్‌ వస్తుంది. ఇక్కడ నుంచే తన పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇకమీదట జగన్‌ చూసుకోబోతున్నారు. ఇందులో మీటింగ్ హాల్‌ - విజిటర్స్‌ వెయిటింగ్‌ రూమ్‌ - టెలీ కాన్ఫరెన్స్‌ రూం లాంటి అత్యాధునిక సదుపాయాలున్నాయి. ఇక పార్టీ ఆఫీస్‌ పక్కనే జగన్‌ ఇల్లు కూడా ఉంది. ఇకమీదట జగన్‌ అక్కడే ఉండబోతున్నారు. వీటి పక్కనే కొన్ని విల్లాలు కూడా ఉన్నాయి. ఇవి పార్టీ ప్రముఖులవి. జగన్‌తో అత్యవసర భేటీ - కార్యకలాపాలు - విస్తృతస్థాయి సమావేశాలపై చర్చించేందుకు పార్టీలోని కీలక నేతలు కూడా పక్కనే ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. లెక్కప్రకారం.. డిసెంబర్‌ నాటికే ఇంటి నిర్మాణం పూర్తికావాలి. కానీ అనివార్య కారణాలు వల్లే లేట్‌ అయ్యింది. ప్రస్తుతం ఫనిషింగ్‌ స్టేజ్‌ లో ఉంది ఇంటినిర్మాణం. దీంతో.. ఫిబ్రవరి 14 తర్వాత తాడేపల్లికి షిఫ్ట్‌ అయిపోవాలని చూస్తున్నారు జగన్‌.