Begin typing your search above and press return to search.

జగన్ సరికొత్త వ్యూహం: ఎన్టీఆర్ పేరుతోనే టీడీపీకి చెక్!

By:  Tupaki Desk   |   22 Jun 2020 9:10 AM GMT
జగన్ సరికొత్త వ్యూహం: ఎన్టీఆర్ పేరుతోనే టీడీపీకి చెక్!
X
స్వపరిపాలన ప్రజలకు చేరువ చేసేలా జగన్ అధికార వికేంద్రీకరణపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మూడు రాజధానిల నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల సమయంలోనే జగన్ అధికారంలోకి వస్తే జిల్లాల విభజన చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీ అమలు కావాల్సి ఉంది. లోక్ సభ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ఉన్న 9 జిల్లాలను 25 జిల్లాలు చేస్తానని ప్రకటించారు.

ప్రస్తుతం జిల్లాల విభజనపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. జిల్లాల విభజనపై కసరత్తు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల విభజనతో రాజకీయంగాను లబ్ధి పొందేందుకు జగన్ చూస్తున్నారు. అందులో ముఖ్యమైనది కృష్ణా జిల్లా విభజన. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ పేరు మీద జిల్లా పెడుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో అప్పట్లోనే టీడీపీకి షాక్ తగిలింది. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా విభజన చేయనున్నారు. అయితే ఈ జిల్లా విభజనపై కొంత ఉత్కంఠ ఏర్పడింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజించనున్నారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు ఏ జిల్లాకు వెళ్తుందో తెలియదు. ఏ ప్రాంతంలో నిమ్మకూరు వెళ్తుందో ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయనున్నారు.

గణతంత్ర దినోత్సవంలోపు జిల్లాల విభజన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విభజించే రెండు జిల్లాల్లో నిమ్మకూరు ఉండే ప్రాంతంలోని ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టనున్నారు ఇందులో భాగంగా మరో జిల్లా విశాఖపట్నం రెండుగా మారితే అరకు ప్రాంతం ఉండే జిల్లాకు మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టనున్నారని సమాచారం. ఈ విధంగా స్థానిక పరిస్థితులు.. రాజకీయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల విభజన.. వాటికి పేర్లు పెట్టే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.