Begin typing your search above and press return to search.
జగన్ బిగ్ ప్లాన్
By: Tupaki Desk | 30 July 2015 6:52 AM GMT ప్రత్యేక హోదాపై పోరాటానికి జగన్ సిద్ధమవుతున్నారు... ఇందుకోసం ఆయన దీక్షకు దిగుతారట... అయితే.. జగన్ దీక్షలు చేయడం సాధారణమే అని లైట్ గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈసారి ఆయన డైరెక్టుగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీ ప్రత్యేక హోదా దీక్ష చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏపీ ప్రభుత్వం తరఫున చంద్రబాబునాయుడు కానీ.... కేంద్రంలో ఉన్న బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకులు కానీ దీనిపై ఏమీ మాట్లాడలేని తరుణంలో జగన్ ఇలా ప్రత్యేక హోదాపై ఢిల్లీలో దీక్షకు దిగితే టీడీపీ, బీజేపీలకు అది ఇబ్బందే. ఈ విషయంలో ఇప్పటికే లేటు చేశామని భావిస్తున్న జగన్ ఆగస్టు 15 తరువాత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఈ దీక్షలో పాల్గొంటారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండు చేస్తూ ఈ దీక్ష ఉంటుంది.
ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు ఉండడంతో ఆ తరువాత దీక్ష చేపడితేనే ప్రయోజనం ఉంటుందని... ఆ తరువాత కూడా వెంటనే 15న స్వాంతంత్ర్య దినోత్సవం ఉండడంతో 15 తరువాతే దీక్ష చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ దీక్ష ఎన్ని రోజులు చేయాలి... ఒక్క రోజు చేయాలా... ఇంకా ఎక్కువ రోజులు చేయాలా... కేవలం నాయకులే చేయాలా... ప్రజలనూ తరలించాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ఆగస్టు 8న జరిగే వైసీపీ సమావేశంలో ఇవన్నీ నిర్ణయిస్తారు.
అయితే... కీలకమైన అంశమైన ప్రత్యేక హోదా సాధాన విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వైసీపీ చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఈ దీక్ష ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని.. అన్ని పార్టీలనూ ఆకర్షించాలని... భావిస్తున్న జగన్ అందుకుగాను దీక్షను భారీ ఎత్తునే చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు నాయకులు, కార్తకర్తలను కూడా భారీగా తరలిద్దామని జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులతో అన్నట్లు సమాచారం. మొత్తానికి జగన్ ప్రత్యేక హోదాపై ఫైట్ కు రెడీ అవుతున్నట్లే ఉంది.