Begin typing your search above and press return to search.
బాబు నోరు విప్పితే ఏం చేయాలో చెప్పిన జగన్!
By: Tupaki Desk | 3 July 2019 5:30 PM GMTనిజాన్ని నమ్ముకున్నోడికి గుట్టుగా.. చాటుమాటుగా చెప్పాల్సిన విషయాలంటూ ఏమీ ఉండవు. అన్ని ఓపెన్ గా మాట్లాడేస్తుంటారు. ఇదే తీరు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తమ రాజకీయ ప్రత్యర్థి మాట్లాడుతుంటే.. వారు మాట్లాడకుండా అడ్డుకోవటం.. అరవటం.. కేకలు వేయటం లాంటివి చూస్తుంటాం. ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని గుట్టుగా తెర చాటున చేస్తుంటాయి
రాజకీయ పార్టీలు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కొత్త సంస్కృతికి తెర తీశారు జగన్. తాజాగా ఎమ్మెల్యేలకు శిక్షణ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీ ఎమ్మెల్యేల్లో 70 మంది కొత్త ఎమ్మెల్యేలని.. నిబంధనల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలన్నారు.సభను హుందాగా ఎలా నిర్వహించాలో చెప్పిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి ఓపెన్ గా చెప్పేశారు.
గత ప్రభుత్వం మాదిరి మైకు పట్టుకున్నంతనే మాట్లాడనీయకుండా చేసే తీరును మనకొద్దన్నారు. ఈ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. విపక్ష నేతగా చంద్రబాబు మాట్లాడే ప్రయత్నం చేస్తే అవకాశం ఇద్దామన్నారు. ఆయన్ను ఎలా ఇరుకున పెట్టొచ్చన్న విషయాన్ని జగన్ మాటల్లోనే చెబితే..
ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో టైమిద్దాం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన పాయింట్లలో మోర్ లాజికల్ గా.. మోర్ ఎఫెక్టివ్ గా.. మన ఆర్గ్యుమెంట్ మనం వినిపిస్తే.. ప్రజలు దానిని చూస్తారు. ఎవరు ఏ విషయాన్ని మాట్లాడారు. ఎవరు ఏ విషయాన్ని ఎంత లాజికల్ గా చెప్పారన్నది చూస్తారు. ఆ ధైర్యం.. నమ్మకం మనకు ఉన్నప్పుడు ఎవరో మాట్లాడుతుంటే మనం ఎందుకు భయపడాలి? మాట్లాడనీయకూడదని ఎందుకనుకోవాలి? మాట్లాడకుండా ఎందుకు కుట్రలు పన్నాలి? మన పాలన మీద నమ్మకం ఉంది. ఎవరో లేస్తారని.. మాట్లాడనీయకుండా ఉండాలని ఎందుకు అనుకోవటమని వ్యాఖ్యానించారు. ఇంత ఓపెన్ గా ఏముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలకు ఈ తరహా సందేశం ఇస్తారని అనుకోలేం.