Begin typing your search above and press return to search.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ ఊహించని నిర్ణయం
By: Tupaki Desk | 7 Feb 2021 6:30 AM GMTఆంధ్రప్రదేశ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. రాష్ట్రంలోని అతిపెద్ద కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మికుల నిరసన ఉవ్వెత్తున సాగుతోంది. వీరి నిరసనలకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్రంపై పోరు సలుపుతున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు విశ్రమించేది లేదని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, వాపపక్షాలు ఇప్పటికే పాల్గొన్నాయి.
ఇటీవల అధికార వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ ఉద్యమానికి మద్దతు తెలిపి కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు.. ఇలా రోజురోజుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృతం దాల్చడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఓ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగుల వేస్తున్నారు.
దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు ఉపసంహకరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లోనూ ఈ అంశాన్ని చేర్చడం వంటి చర్యలతో ప్లాంట్ కార్మికులు భగ్గుమంటున్నారు. ఈ పరిమాణాలన్నీ పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలకు మోడీ వెనక్కి తగ్గపోతే ప్రైవేట్ అప్పగించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఓ ఉక్కు కర్మాగారాన్ని కేటాయించాల్సి ఉంది. కానీ ఆ విషయాన్ని గత ఆరేళ్లుగా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి స్టీల్ ఫ్యాక్టరీని ఇస్తానన్న కేంద్రం ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయం తెరపైకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించేలా ప్లాన్ వేస్తోంది.
రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర పెట్టుబడుల విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ ఇప్పటికే మోడీకి ఓ లేఖ రాశారు. అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం అయ్యేలా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇతరులకు అప్పగించడం కంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే లాభాల పంట పండించవచ్చని ఆలోచిస్తున్నారు. అయితే జగన్ నిర్ణయంపై మోడీ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.