Begin typing your search above and press return to search.

బాబు అవినీతిని జగన్ బయటకు తీసుకొస్తారట!

By:  Tupaki Desk   |   26 May 2019 2:30 PM GMT
బాబు అవినీతిని జగన్ బయటకు తీసుకొస్తారట!
X
వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై యుద్ధం ప్రకటించేశారు. ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్....ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలిశారు. ప్రదానితో సుమారు గంటకు పైగానే భేటీ అయిన జగన్... ఏపీకి సంబందించిన పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. మోదీతో భేటీ ముగిశాక... అక్కడే మీడిమాతో మాట్లాడిన సందర్బంగా జగన్ పలు సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీస్తానని జగన్ ప్రరటించారు. నవ్యాంంద్ర నూతన రాజధాని అమరావతి, జాతీయ ప్రాజెక్టు కలిగిన పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

జగన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... బాబు పాలనలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీస్తామని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం ప్రస్తుతం 2.58 కోట్ల అప్పుల్లో ఉందని చెప్పిన జగన్... ఆ అప్పుల్లో నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకే తాను మోదీని కలిశానని తెలిపారు. రాజధానిలో భారీ స్కాం జరిగిందని, దానిని బయటకు తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజధాని ఎక్కడో ముందుగానే తన మద్దతుదారులకు లీక్ చేసి భూములు కొనుగోలు చేయించారని ఆయన ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో బలవంతంగా భూములు లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మ్యాప్ లో మంత్రులు - టీడీపీ నేతల భూములను తప్పించి రైతుల భూములను మాత్రం అందులో చేర్చారని ఆయన ఆరోపించారు.రాజధాని విషయంలో చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టుగా తెలుస్తోందని, దీనిని తాను బయటకు తీసుకొస్తామని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్టులోనూ అవినితి జరిగి ఉంటే... ఏకంగా ప్రస్తుతం కొనసాగుతున్న టెండర్లను రద్దు చేసి రీటెండర్లు పిలుస్తామని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం కట్టదని - కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అయితే నిర్ణీత కాల వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినితి రహిత - పారదర్శకత కలిగిన పాలనను అందిస్తానని, అదెలా ఉంటుందో ఆరు నెలల్లోపై తెలుస్తుందని కూడా జగన్ వ్యాఖ్యానించారు. మొత్తంగా చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు చేసిన జగన్.... ఆ మొత్తం అవినీతిని వెలికి తీసి ప్రజల ముందు పెడతానని సంచలన ప్రకటన చేశారని చెప్పాలి.