Begin typing your search above and press return to search.
8 వేల ట్రక్కులు కొనాలని డిసైడ్ చేసిన జగన్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 24 March 2021 6:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఆయన ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో.. అంతే వేగంగా అమలు దిశగా ప్లాన్ చేస్తుంటారు. తాజాగా ఒక ఉదంతం దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న ప్లాన్ మదిలోకి వచ్చిన జగన్.. వెనుకా ముందు చూసుకోకుండా భారీగా ప్లాన్ చేశారు. నిధుల కొరత గురించి పెద్దగా పట్టించుకోని ఆయన.. తాను అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయటం కోసం అధికారులకు ఇచ్చే ఆదేశాలు ఎంత స్పష్టంగా ఉంటాయన్నది ఈ ఉదంతాన్ని చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి ఎప్పటికప్పుడు చెత్తే ఎత్తేసే వాహనాల అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించిన జగన్.. అందుకు భారీగా ప్లాన్ చేశారు. రాష్ట్రం మొత్తానికి ఎన్ని ట్రక్కులు కావాలన్న విషయాన్ని అధికారుల్ని అడిగిన ఆయన.. చివరకు రాష్ట్రంలోని ప్రతి వార్డుకు రెండేసి చొప్పున 8వేల ట్రక్కుల అవసరమని తేల్చారు. అంతే.. ఒకేసారి 8 వేల ట్రక్కుల కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు చెప్పి వదిలేయకుండా.. ఆ ట్రక్కుల్ని రాష్ట్రానికి చేరటమే కాదు.. వాటిని పని చేయించటానికి డేట్ డిసైడ్ చేశారు.
అంతేనా.. చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్.. కెమెరాల ఏర్పాటుతో పాటు.. వీధి చివరన కుండీల ఏర్పాటతో పాటు.. సేకరించిన తడి.. పొడి చెత్తను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దీనంతటికి జులై 8 టార్గెట్ గా ఇచ్చిన జగన్.. ఆ రోజున ఈ ట్రక్కులు పని చేయటం మొదలు కావాలని డిసైడ్ చేశారు. ఇలా.. తాను అనుకున్న పని విషయంలో స్పష్టంగా ఉండటమే కాదు.. ఏం చేయాలన్నా వెనుకాడకుండా చేసే తీరు.. ఆయనకు కొత్త ఇమేజ్ తీసుకురావటమే కాదు.. ప్రజల్లో పలుకుబడి పెంచేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల ట్రక్కులు పనిలోకి దిగితే ఎలా ఉంటుటందంటారు? ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి.