Begin typing your search above and press return to search.

జగన్ డెసిషన్ తో పీక్స్ లోకి... ?

By:  Tupaki Desk   |   25 Nov 2021 1:30 AM GMT
జగన్ డెసిషన్ తో పీక్స్ లోకి... ?
X
కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు దాని ఫలితాలు పర్యవశానాలు వేరేగా ఉంటాయి. ఏపీలో శాస‌నమండలి అలాంటి వాటిని ఎన్నో చూసింది. జగన్ రెండేళ్ల క్రితం శాసన మండలి వద్దు అనుకున్నపుడు అక్కడ ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా ఉన్న ఇద్దరి పదవులకు ఒక్కసారిగా ముప్పు వచ్చింది. గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన రెవిన్యూ శాఖను చూస్తున్నారు. ఆయనతో పాటు గుంటూరు కి చేందిన మోపిదేవి వెంకటరమణ కూడా మంత్రి పదవుల నుంచు తప్పుకోవాల్సి వచ్చింది.

ఇపుడు మండలి రద్దు వద్దు అనుకున్నారు. కానీ ఆ ఇద్దరూ మంత్రులుగా మళ్లీ కాలేరు అన్నదే వారి వర్గీయుల బాధ. మరో వైపు చూస్తే వారికి రాజ్యసభ మెంబర్ షిప్ ఇచ్చి జగన్ న్యాయం చేసినా మంత్రి పదవులు మాత్రం దక్కలేదు అన్న ఆవేదన వారిలో ఎప్పటికీ ఉంటుంది. వారి సంగతి అలా ఉంచితే ఇపుడు శాసన‌మండలి ఉండడం ఖాయం. దాంతో వారంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. రానున్న కాలమంతా కూడా మండలిలో వైసీపీదే హవా. దాంతో ఆశావహులు కూడా తాము ఫ్యూచర్ ఎమ్మెల్సీస్ అనుకుంటున్నారు. ఈ సందడి ఇలా ఉంటే మండలి రద్దు కాకపోవడంతో అక్కడ నుంచి మంత్రులను తీసుకుంటారు అన్న ఆశలు పెరుగుతున్నాయట.

జగన్ గతంలో ఇద్దరికి మండలి నుంచి చాన్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా అలాంటిది జరుగుతుంది అంటున్నారు. దాంతో మండలి నుంచి కూడా పలువులు ఒక్కసారిగా మంత్రి పదవుల కోసం రేసులోకి దూసుకువస్తూండడంతో పోటీ పీక్స్ లోకి చేరుకుంటోంది. మండలిలో తీసుకుంటే సీనియర్ నేత, మాజీ మంత్రి సి రామచంద్రయ్య పేరు వినిపిస్తోంది. ఆయన జగన్ సొంత జిల్లాకు చెందిన నేత. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఆర్ధిక మంత్రిగా అవకాశం ఉంటుంది అంటున్నారు. అదే విధంగా విశాఖ జిల్లాకు చెందిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ కి కూడా మంత్రి పదవి ష్యూర్ అంటున్నారు. శ్రీకాకుళం విషయానికి వస్తే పాలవలస విక్రాంత్ కి మంత్రి సీటు కన్ ఫర్మ్ అనే మాట ఉంది. అదే సమయంలో జగన్ కి ఎంతో ఇష్టుడు అయిన దువ్వాడ శ్రీనివాస్ ని మంత్రిని చేసి ట అచ్చెన్నాయుడు ఇలాకాలో బ్రేకులు వేయవచ్చు అంటున్నరు. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే మంత్రి పదవుల కోసం వంద మందికి పైగా ఎమ్మెల్యేలు పోటీలో ఉంటే వారికి మరో పాతిక మంది దాకా మండలి నుంచి గట్టి పోటీ ఇస్తున్నారు. చూడాలి జగన్ ఎవరిని మంత్రులుగా చేస్తారు, ఎవరికి చాన్స్ ఇస్తారు అన్న‌ది.