Begin typing your search above and press return to search.
పాలిటిక్సులోకి వైఎస్ భారతి?
By: Tupaki Desk | 22 April 2017 10:05 AM GMTఏపీ రాజకీయాల్లోకి మరో ఛరిష్మాటిక్ వ్యక్తి రానున్నారా..? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ భార్య భారతి కూడా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ - మీడియా వర్గాలు. వచ్చే ఎన్నికల బరిలో ఆమెను దించేందుకు వైసీపీ నుంచి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే.. ఆమె ఆసక్తి ప్రకారం కాకుండా పార్టీ అవసరాల రీత్యా ఆమెను బరిలో దించాలనుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ ను ఎన్నికల నాటికి మళ్లీ జైలుకు పంపించాలని టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో ముందు జాగ్రత్తగా భారతిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య సాక్షి పత్రికను సమర్థంగా నడిపిస్తున్నారు. ఆ నమ్మకంతోనే జగన్ ఆమెను రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారట. ఒకవేళ చంద్రబాబు కుట్రలు ఫలించి తాను జైలుకు వెళ్లాల్సి వస్తే భారతి ప్రచారంలో పాల్గొంటూ పార్టీని నడిపిస్తూ ఎన్నికలకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నది ఆలోచనగా తెలుస్తోంది.
జగన్ తల్లి విజయమ్మ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవడం... వయసు పరంగానూ ఆమెను మళ్లీ ఎన్నికల బరిలో దించేందుకు జగన్ ఇష్టపడడం లేదని.. దాంతో అవసవరమైతే భారతికే బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/