Begin typing your search above and press return to search.
మోడీకి చంద్రబాబుపై జగన్ చాడీలు!
By: Tupaki Desk | 17 Oct 2015 9:01 AM GMTదీక్ష భగ్నమై ఇంట్లో కూర్చున్న వైసీపీ అధినేత జగన్ రాజధాని శంకుస్థాపనకు తాను పిలిచినా రానని చెప్పడం.... అయినా, కలవడానికి మంత్రులు ప్రయత్నించినా వారిని కలవకపోవడం తెలిసిందే. తాజాగా ఆయన ప్రధానిని కూడా రావొద్దని చెప్పాలనుకుంటున్నారట. అందుకే ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ జగన్ మోహన్ రెడ్డి శనివారం లేఖ రాశారట. ఈ నెల 22వ తేదీ(శంకుస్థాపన తేదీ) లోపు ఎలాగైనా మిమ్మల్ని కలవాలి... అదుకు అవకావమివ్వండి అంటూ ఆయన మోడీకి లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై ప్రధానితో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో రాశారు. దాంతో పాటు ప్రధానిని కూడా రావొద్దని కోరాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ లోపలే తనకు సమయం కేటాయించాలని కోరుతూ జగన్ ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇంతెత్తున ఎగిరపడుతున్నారు. అయ్యన్నపాత్రుడు - కామినేని శ్రీనివాస్ లు జగన్ పై మండిపడ్డారు. అమరావతి ఆహ్వానం ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్తున్నా కలవడం లేదని... రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేత అంటే ఎలా ఉండాలో తెలంగాణ నేత జానా రెడ్డిని చూసి జగన్ నేర్చుకోవాలని వారు సూచించారు. జగన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం చంద్రబాబు నాయుడి ఇంట్లో ఫంక్షన్ కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఫంక్షన్ అని వారు చెప్పారు.
ఇంటికొచ్చిన వారిని కలవకుండా పంపించేస్తున్న జగన్ ఏ మొఖం పెట్టుకుని ప్రధానిని కలుస్తానంటూ లేఖ రాశారని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై చర్చించడం ఆయన ఉద్దేశం కాదని... అమరావతికి వెళ్లొద్దంటూ ప్రధానికి చంద్రబాబుపై చాడీలు చెప్పడానికే ఆయన అపాయింటుమెంటు అడిగారని అంటున్నారు.