Begin typing your search above and press return to search.

బాబు అండ్ కోకు మంట పుట్టిస్తున్న జ‌గ‌న్ లేఖ‌

By:  Tupaki Desk   |   7 May 2017 4:52 AM GMT
బాబు అండ్ కోకు మంట పుట్టిస్తున్న జ‌గ‌న్ లేఖ‌
X
త‌న మాట‌ల‌తో ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నిద్ర లేకుండా చేస్తున్న విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. తాజాగా రాసిన ఒక లేఖ ఆస‌క్తిక‌రంగా మారింది. బాబు పాల‌నలోని త‌ప్పుల్ని ఎత్తి చూపుతూ.. బాబు ఇచ్చిన ఎన్నిక‌ల‌ హామీల్ని నెర‌వేర్చే క్ర‌మంలో చోటు చేసుకున్న వైఫ‌ల్యాన్ని ఎత్తి చూపిస్తూ రాసిన బ‌హిరంగ లేఖ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎన్నిక‌ల వేళ‌.. బాబు వ‌స్తే జాబు గ్యారెంటీ అంటూ ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు.. ఏపీ రాష్ట్ర నిరుద్యోగుల‌కు రూ.1.22 ల‌క్ష‌ల కోట్ల బాకీ ఉన్న‌ట్లుగా ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని.. నెల‌నెలా రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని హామీ ఇచ్చిన ఆయ‌న మాట‌.. నేటికి నెర‌వేర‌లేద‌న్న విష‌యాన్ని చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టికైనా నిరుద్యోగుల గోడును అర్థం చేసుకొని.. ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తాను అదికారంలోకి వ‌చ్చిన వెంట‌నే నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని.. ఒక‌వేళ ఉద్యోగం రాని వారికి నెల‌కు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ ఉద‌ర‌గొట్టార‌ని.. తాను చెప్పే మాట‌ల్ని క‌ర‌ప‌త్రం వేసి మ‌రీ.. కింద సంత‌కం పెట్టి ప్ర‌జ‌ల‌కు పంచార‌ని.. అలా మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చి 35 నెల‌లు గ‌డిచిపోయాయ‌ని చెప్పారు.

ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీని అమ‌లు చేయాలంటూ ఫిబ్ర‌వ‌రి 22న ఒక లేఖ‌ను రాసినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స్పంద‌న ప్ర‌భుత్వం నుంచి లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. మొక్కుబ‌డిగా గ్రూపు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారే త‌ప్పించి.. ఉద్యోగాలు మాత్రం రావ‌టం లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో మొత్తం 1.75ల‌క్ష‌ల ఇళ్ల వారికి నిరుద్యోగ భృతి చెల్లించాల‌ని.. 35నెల‌లుగా 1.75 కోట్ల ఇళ్ల‌కు రూ.2వేల చొప్పున చెల్లించాల్సిన బ‌కాయి రూ.1.22 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని.. ఉద్యోగం ఇవ్వ‌కున్నా.. నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాల‌న్నారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో రాష్ట్రంలో అన్నిస్థాయిల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీ సంఖ్య 1.42ల‌క్ష‌లుగా ఉంటుంద‌ని.. ఈ పోస్టుల భ‌ర్తీ కోసం ఏపీ ప్ర‌భుత్వ విధానం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు గ‌డుస్తున్నా.. పోస్టుల భ‌ర్తీ విష‌యంలో ప్ర‌భుత్వం వెనుక‌బ‌డిపోయి ఉంద‌ని పేర్కొన్నారు. గ‌త ఏడాది 10వేల మంది ఉపాధ్యాయ పోస్టుల‌భ‌ర్తీ జ‌రిగినా.. ఇంకా 17 వేల‌కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తు చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల్ని ఇప్ప‌టికైనా అమ‌లు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/