Begin typing your search above and press return to search.
అధికారులకు వణుకు పుట్టించే యాప్ గురించి చెప్పిన జగన్
By: Tupaki Desk | 29 Feb 2020 3:30 PM GMTపని కట్టుకొని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న తలంపుతో ఏపీ ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. కొన్ని మీడియా సంస్థలు జతకట్టటం తో ఏపీలో అమలవుతున్న పలు అంశాలు పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకోవటం లేదు. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న తీరుకు భిన్నంగా సీఎం జగన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన మార్పులు.. ప్రవేశ పెట్టిన కొత్త పథకాల ఫలితాల వివరాలు పెద్దగా బయటకు రావటం లేదు.
జగనన్న గోరుముద్ద పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన సరికొత్త పథకం సూపర్ సక్సెస్ కావటమే కాదు.. గతంలో సర్కారు భోజనం కోసం పెద్దగా ఆసక్తి చూడని చిన్నారులు.. ఇప్పుడు దానిపై మక్కువను పెంచుకున్నారు. పుష్టికరమైన.. రుచికరమైన.. నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం కొత్త పుంతలు తొక్కుతోంది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే సిబ్బంది.. అధ్యాపకులు సైతం తమ ఇళ్లల్లోనూ ఇంతటి నాణ్యమైన మెనూను అమలు చేయటం లేదని వ్యాఖ్యానిస్తున్నారంటే.. గోరుముద్ద పథకం ఎంత సక్సెస్ అయ్యిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఈ పథకానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. అవి పక్కదారి పట్టకుండా ఉండటం కోసం సరికొత్త యాప్ ను రూపొందించారు. ఈ యాప్ లో ఏ రోజు ఏ మెనూ అమలవుతుందో స్పష్టంగా పేర్కొనటమే కాదు.. మధ్యాహ్న భోజనంపై ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ వచ్చినా వెంటనే యాప్ లో తెలిసేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనంలో పిల్లందరికి చిక్కీ (వేరుశెనగ.. బెల్లంతో తయారు చేసే పాకం ముక్క) అందుతుందా? అని సీఎం జగన్ ప్రత్యేకంగా అడిగారు. కొత్త మెనూతో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అన్న ఆరా తీసిన జగన్.. కొత్త యాప్ తో అక్రమార్కులు.. అవినీతి అధికారులకు వణుకేనని చెబుతున్నారు.
త్వరలో విద్యార్థులకు అందజేయాలని భావిస్తున్న జగనన్న విద్యా కానుకలోని వస్తువులు (మూడు జతల యూనిఫాం క్లాత్.. నోట్ బుక్స్.. షూస్ అండ్ సాక్స్.. బెల్ట్.. బ్యాగ్.. టెక్ట్స్ బుక్స్) నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా విద్య విషయం లో సీఎం జగన్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.