Begin typing your search above and press return to search.
జగన్ విద్యాదీవెన.. 10 కోట్లు జమ
By: Tupaki Desk | 30 Nov 2021 11:30 AM GMTఒకవైపు రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోందనే హెచ్చరికలు.. మరోవైపు.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. నివేదిక కొరడాలు... అయినా కూడా ఏపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. తమ నిధులు లాగేసుకుంటున్నారంటూ.. వివిధ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఉద్యోగులు సమరానికి రెడీ అవుతున్నారు ఇదిలావుంటే.. తాజాగా జగన్ మరో కీలక పథకానికి నిధులు విడుదల చేశారు.
జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులను సీఎం జగన్ తాజాగా విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి.. దాదాపు 11.03 లక్షల మంది విద్యార్థులకు 9.87 కోట్ల రూపాయలను నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధులను విద్యార్థుల ఉన్నత చదువుకు వినియోగించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదలు పెద్ద చదువులు చదివేందుకు, పెద్ద స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డు కాకూడదని అన్నారు.
పేదలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్న ఉద్దేశంతోనే.. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో త్రైమాసికం విద్యా దీవెన కింద 9 లక్షల 87 వేల 965 మంది తల్లుల ఖాతాలకు 9.87 కోట్ల నగదును ముఖ్యమంత్రి విడుదల చేశారు. విద్యా దీవెన పథకం ద్వారా 21 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందని సీఎం తెలిపారు.
అయితే.. జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంపై మాత్రం.. కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పుడు.. ఇంతలా అప్పులు చేస్తున్నప్పుడుకూడా.. ఇలా చేయడం అవససరమా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంత మేరకు కుదుట పడిన తర్వాత.. ఆయా పథకాలను అమలు చేయొచ్చు కదా? అని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యవహారం.. మరోసారి చర్చకు వస్తుండడం గమనార్హం.