Begin typing your search above and press return to search.

జగన్ ధైర్యమిదేనా ?

By:  Tupaki Desk   |   25 March 2022 6:30 AM GMT
జగన్ ధైర్యమిదేనా ?
X
మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడుందని తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు. పైగా అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో హైకోర్టు తీర్పునే జగన్ తప్పుపట్టారు. మామూలుగా అయితే కోర్టు తీర్పును తప్పు పట్టేంత సాహసం ఎవరు చేయరు.

కానీ జగన్ మాత్రం హైకోర్టు తీర్పును లెక్కచేయలేదు. నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవటం కాదు. ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లోనే కోర్టు తీర్పును తప్పుపట్టడమంటే మామూలు విషయం కాదు.

కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడటమంటే జగన్ పెద్ద సాహసం చేసినట్లే అనుకోవాలి. జగన్ ఇంతటి ధైర్యానికి కారణం ఏమిటి ? ఏమి చూసుకుని కోర్టు తీర్పే తప్పని జగన్ చెప్పగలిగారు ?

ధైర్యం ఏమిటంటే ప్రజల మద్దతు తనకే సంపూర్ణంగా ఉందన్న నమ్మకమే అని పార్టీ వర్గాలంటున్నాయి. తాను మూడు రాజధానులను ప్రతిపాదించిన తర్వాతే స్ధానిక సంస్ధల ఎన్నికలు, తిరుపతి, బద్వేలు లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. అన్నీ ఎన్నికల్లోను వైసీపీయే గెలిచింది.

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. మిగిలిన రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేయటం ఒక ఎత్తు, రాజధాని జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ చేయటం మరో ఎత్తు. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అంటే అంతకు ముందు చంద్రబాబు నాయుడు అమరావతి అంశాన్ని జనాలు తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది.

అలాగే మూడు రాజధానులకు జనాల మద్దతున్న కారణంగానే అన్ని చోట్లా వైసీపీ అఖండ విజయం సాధించిందని జగన్ బలంగా నమ్ముతున్నారట. కాబట్టి రేపటి సాధారణ ఎన్నికల్లో కూడా జనాలు తమనే గెలిపిస్తారని జగన్ గట్టిగా నమ్ముతున్నారట. ఆ ధైర్యంతోనే అసెంబ్లీలో మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడుందని స్పష్టంగా ప్రకటించారట. జగన్ తాజా ప్రకటనపై హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనేది ఇపుడు ఆసక్తిగా మారింది.