Begin typing your search above and press return to search.

తన సంక్షేమ పథకాలను ప్రగాఢంగా నమ్ముతున్న జగన్

By:  Tupaki Desk   |   12 Dec 2020 10:30 AM GMT
తన సంక్షేమ పథకాలను ప్రగాఢంగా నమ్ముతున్న జగన్
X
మామూలుగా ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే తర్వాత జరిగే ఉపఎన్నికలో కుటుంబసభ్యులనే పోటీ చేయించటం రివాజు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ సంప్రదాయానికి గండిపడింది. ఇదంతా ఇపుడెందుకంటే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక గురించే. ఉపఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా తిరుపతిలో రాజకీయంగా వేడి అయితే రాజుకుంటోంది. ముందే చెప్పుకున్నట్లు వైసీపీ ఎంపి బల్లి దుర్గా ప్రసాదరావు చనిపోయిన కారణంగా ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

జరగబోయే ఉపఎన్నికలో టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేయబోతున్నారు. ఇక బీజేపీ+జనసేన తరపున ఎవరు పోటీ చేస్తారో తెలీదు. అయితే వైసీపీ తరపున మాత్రం కొత్త అభ్యర్ధి పోటీలోకి దిగబోతున్నారు. వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపబోతున్నారని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. సెంటిమెంటును నమ్ముకుని బల్లి కుంటుంబసభ్యుల్లో ఎవరినో ఒకరిని పోటిలోకి దింపుతారని అందరు అనుకున్నారు.

అయితే జగన్ మాత్రం సెంటిమెంటుకు పెద్ద విలువ ఇస్తున్నట్లు లేదు. అందుకనే కొత్త అభ్యర్ధి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తిని రంగంలోకి దించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెంటిమెంటు స్ధానంలో తన ఏడాదిన్నర పాలనపైనే జగన్ కు ఎక్కువ నమ్మకం ఉన్నట్లు చెబుతున్నారు. అభ్యర్ధిపైనో లేకపోతే పార్టీ పైనో జనాల్లో వ్యతిరేకత ఉంటే మొన్నటి తెలంగాణాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితమే రిపీట్ అవుతుందని జగన్ గట్టిగా భావిస్తున్నారట.

కాబట్టి సెంటిమెంటును నమ్ముకుని రాజకీయం చేయటం కన్నా గడచిన ఏడాదిన్నర పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధినే జగన్ ఎక్కువగా నమ్ముకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైన చెప్పుకున్నట్లు మామూలుగా అయితే ఈ సీటు వైసీపీది కాబట్టి ఇక్కడ మిగిలిన పార్టీలు పోటీ పెట్టకూడదు. కానీ సంప్రదాయానికి భిన్నంగా పోటీకి రెడీ అయిపోతున్నాయి.

నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయలేదా ? అని దివ్యావాణి అతితెలివితో ప్రశ్నించారు. అక్కడ భూమా నాగిరెడ్డి గెలిచింది వైసీపీ టికెట్ మీదే అన్న విషయం కూడా దివ్యావాణికి తెలీకపోవటమే విచిత్రం. వైసీపీ తరపున గెలిచిన భూమానాగిరెడ్డిని ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు టీడీపీలోకి లాక్కున్నారు. అంతమాత్రానా భూమా టీడీపీ ఎంఎల్ఏ అయిపోరు. ఎందుకంటే అసెంబ్లీ రికార్డుల ప్రకారం ఆయన చనిపోయేవరకు వైసీపీ ఎంఎల్ఏగానే ఉన్నారు. అనుమానాలున్న వారు ఎవరైనా అసెంబ్లీలో రికార్డులు చూస్తే తెలుస్తుంది.