Begin typing your search above and press return to search.

ఏపీలో వ్యాపారుల‌కు `జ‌గ‌న‌న్న తోడు`... 500 కోట్లు విడుద‌ల‌

By:  Tupaki Desk   |   28 Feb 2022 10:30 AM GMT
ఏపీలో వ్యాపారుల‌కు `జ‌గ‌న‌న్న తోడు`... 500 కోట్లు విడుద‌ల‌
X
'జగనన్న తోడు' పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి జగన్ అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 10వేలకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలను జమ చేశారు. ఒక్కొక్కరికీ 10 వేల రూపాయల వడ్డీలేని రుణాన్ని అందజేశారు. చిరు వ్యాపారుల రుణాలకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటోందని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటివరకు 14 లక్షలమంది చిరువ్యాపారులకు అందజేసినట్లు వివరించారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే మళ్లీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన లబ్ధిదారు రుబియా బేగం మాట్లాడుతూ.. ‘కరోనా వచ్చిన తర్వాత ఇళ్లు గడవడం కూడా కష్టమయ్యేది. రూ. 5, 10 రూపాయల వడ్డీకి కూడా రుణం దొరికేది కాదు. అటువంటి సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది.

దాంతో మళ్లీ మా వ్యాపారం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది. జగనన్న తోడు కింద రూ.10 వేలు, అలాగే ఆసరా కింద రూ.12 వేలు జమ అయ్యాయి. మీరు ఇలా సంక్షేమ పథకాలు పెట్టడంతో మాలాంటి వాళ్లం బతుకుతున్నాం.

ఇది వరకు ఆరోగ్య శ్రీ లేదు. రేషన్‌ కార్డు లేదు. ఇప్పుడు మాకు అవన్నీ ఉన్నాయి. మీరు పెట్టిన వాలంటరీ వ్యవస్థతో వాళ్లే మమ్మల్ని అడిగి మాకు ఏదైతే అవసరమే వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మీ పథకాలన్నీ మేము పొందాము. మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ ఏదో రకంగా ఉపయోగపడుతున్నాయి. మాలాంటి వాళ్లు బ్రతక గల్గుతున్నాం. మీకు రుణపడి ఉంటాము’ అని తెలిపారు.

విశాఖ జిల్లాకు చెందిన మరో లబ్ధిదారు కల్యాణి మాట్లాడుతూ.. ‘అన్నా నమస్కారమన్నా.. నా పేరు కల్యాణి. జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు లబ్ధి పొందాను. నా భర్త తాపీమేస్త్రీ. కుటుంబానికి అండగా ఉండాలనే ఏదైనా చేయాలనుకున్నా. దాంతో ఒక ఫైనాన్షియర్‌ను ఆశ్రయించాను. రూ.10 వేలకు గాను రూ. 9వేలు ఇస్తానన్నారు. కట్టకపోతే ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్పారు.

ఈ విషయం చెబితే నా భర్త అలా తీసుకోవద్దని అన్నాడు. ఆ సమయంలో జగనన్న తోడు మాకు అండగా నిలిచింది. ఈరోజు మీరిచ్చిన రూ.10 వేలతో బ్యూటీ పార్లర్‌ వ్యాపారం ప్రారంభించాను.`` అని వివ‌రించారు. మొత్తానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒవైపు అప్పులు చేస్తున్నా. మ‌రోవైపు వ్యాపారుల‌కు అప్పులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.