Begin typing your search above and press return to search.
స్నేక్ బాయ్ .. పాములాగా కుబుసాన్నీ వదులుతున్న బాలుడు !
By: Tupaki Desk | 1 Jun 2020 11:30 AM GMTపున్నమినాగు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాములా మారిపోవడం గురించి తెలిసిందే. మనిషి పాములా మారడంతో సినిమా కాబట్టి చూడటానికి బాగుంది. కానీ , అదే విదంగా ఇప్పుడు ఓ బాలుడు దర్శనం ఇస్తున్నాడు. అతడి చర్మం కూడా పాములా పొరలు పొరలుగా ఏర్పడుతోంది. నల్లగా మారిపోతుంది. అతడికి చెమట పట్టదు. పైగా శరీరమంతా పొడిబారిపోతుంది. అచ్చు పాములాంటి శరీరంతో నరకయాతన అనుభవిస్తున్నాడు.
సాధారణంగా పాము ఆరు నెలలకోసారి చర్మం పైపొరలను విడుస్తుంది. అలాగే, ఈ బాబుకు కూడా కుబుసంగా శరీరం ఊడిపోతోంది. పాము ఆరు నెలలకోసారి చర్మం పైపొరలను విడుస్తున్నట్లుగా ఈ బాలుడికి శరీరం ఊడిపోతుంటుంది. నమ్మటానికి ఆశ్చర్యంగా , కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. ఈ పరిస్థితిని ఒడిశాలోని గంజాం జిల్లాలో నివసిస్తున్న జగన్నాథ్ అనే 10ఏళ్ల బాలుడు ఎదుర్కొంటున్నాడు.
అతడు పాములా మారిపోతున్నాడని చెప్పుకోవడం కంటే.. అతడు వింతైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాని చెప్పుకోవడమే కరెక్ట్. వైద్య పరిభాషలో దీన్ని ‘లామెల్లార్ ఇచ్థియోసిస్’ అని అంటారు. పుట్టేప్పుడు అతడిలో ఎలాంటి సమస్య కనిపించలేదు. కానీ, వయస్సు పెరిగే కొద్ది అతడిలో మార్పు కనిపించడం మొదలైంది. చర్మం రోజూ పొడిబారిపోయి బిగుసుకుపోతుంది. నల్లగా.. గట్టిగా అయిపోతుంది.జుట్టంతా రాలిపోతుంది. శరీరం వేడిగా అయిపోతుంది. అటువంటిసమయంలో పాపం జగన్నాథ్ నడవటానికి చాలా చాలా కష్టపడతాడు. కర్ర సహాయంతో అతి కష్టంగా నడుస్తాడు. ఆ కాస్తా నడవటానికి జగన్నాత్ మాయిశ్చరైజర్ ప్రతీ 15 నిమిషాలకొకసారి రాసుకోవాల్సిందే.
కానీ జగన్నాథ్ శరీరం వేడికి అది వెంటనేఆరిపోతుంది. కానీ తప్పదు అలా రాసుకుంటూ ఉండాల్సిందే. లేదంటే మరింత గట్టిగా మారిపోతుంది శరీరం. అలా గట్టిపడిపోయిన చర్మం నల్లగా మారిపోయి నెలకు ఒకసారి అచ్చం పాము కుబుసంలాగా వీడిపోతుంది. జగన్నాథ్ చర్మ వ్యాధికి మందులేదని, నివారణ అసాధ్యమని స్థానిక డెర్మటాలజిస్టులు చేతులెత్తేశారు. ఆ బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో వైద్యం అందించలేకపోతున్నారు.
ఈ సందర్భంగా జగన్నాథ్ తండ్రి ప్రభాకర్ ప్రదాన్ స్పందిస్తూ.. నా కొడుకు బాల్యం నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నాడు. అతడికి చికిత్స చేయించడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. అతడిని చూస్తుంటే నా గుండె పగిలిపోతోంది అని తెలిపాడు. లామెల్లార్ ఇచ్థియోసిస్ అనేది చాలా అరుదైన సమస్య అని, ప్రపంచంలో ప్రతి ఆరు లక్షల మందిలో ఒకరికి భిన్న రకాల్లో ఈ సమస్య వస్తుందని, జగన్నాథ్‌కు వచ్చిన సమస్య చాలా తీవ్రమైనదని తెలుపుతున్నారు.