Begin typing your search above and press return to search.
దీపావళి టపాసులపైనా జగనన్న బ్రాండ్!
By: Tupaki Desk | 25 Oct 2022 5:03 AM GMTప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి హీట్ మీద ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే ఎన్నికలన్నట్టు వాతావరణం ఆయా పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కిపోయింది.
కాగా దీపావళికి పండుగ టపాసులపైనా జగనన్న బ్రాండ్ దర్శనమివ్వడం గమనార్హం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న పేరుతో దాదాపు 50కి పైగా పథకాలు అమలవుతున్నాయి.
ఇక ఇప్పుడు దీపావళి టపాసులపైన కూడా జగన్ ఆటమ్ బాంబ్స్ అంటూ ఉండటం గమనార్హం. ఆ టపాసులపైన జగన్ సీరియస్‌గా ఉన్న ఫొటో, ఒక సింహం బొమ్మను కూడా పొందుపరిచారు. ఇప్పుడీ ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాధారణంగా దీపావళి టపాసులపైన సినిమా నటుల ఫొటోలను తయారీదారులు ముద్రిస్తుంటారు. అయితే ఈసారి దీపావళి టపాసులపై జగన్ ఫొటోను చిత్రీకరించడం గమనార్హం.
దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ నాయకుడికి ఉన్న క్రేజుకు నిదర్శమని చెబుతున్నారు. జగన్ తప్ప ఏ రాజకీయ నాయకుడు ఫొటోలు టపాసులపైన లేవని.. ఇది జగన్ ఒక్కడికి మాత్రమే సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు జగన్ అభిమానుల అత్యుత్సాహంపై ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు నీళ్లు చల్లుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీఎం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌పై వేసిన అణుబాంబు జగనేనని ఎద్దేవా చేస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, అభివృద్ధిని నాశనం చేసిన జగన్ నిజంగానే అణుబాంబు అని.. ఆయన ఫొటోను టపాసులపైన వేయడంలో వింతేమీ ఏమీ లేదని అంటున్నారు. తద్వారా జగన్‌ను ఎగతాళి చేస్తున్నారు.
జగన్ ఫొటోతో కూడిన టపాసులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని వైఎస్సార్సీపీ శ్రేణులు షేర్ చేస్తున్నారు. లైకులు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాల నుంచి సెటైర్లు పడుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.