Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌ర్కారు ఇబ్బందుల్లో ప‌డ‌నుందా? జ‌నం ఏమ‌న్నారంటే

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
జ‌గ‌న్ స‌ర్కారు ఇబ్బందుల్లో ప‌డ‌నుందా?  జ‌నం ఏమ‌న్నారంటే
X
ఏపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. త‌న మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌క్షాళ‌న చేసుకున్నారు. తాజాగా 14 మంది కొత్త 11 మంది పాత మంత్రుల‌ను క‌లుపుకొని 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. దీనిపై తాజాగా మాజీలైన మంత్రులు.. గ‌రంగ‌రంగా ఉన్నారు. ఇది మాట త‌ప్ప‌డం.. మ‌డమ తిప్ప‌డం కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఏర్ప‌డిన జ‌గ‌న్ స‌ర్కారు తొలి కేబినెట్ కూర్పులో వ‌చ్చే రెండున్న‌రేళ్ల‌లో 90 శాతం మంది ని త‌ప్పించి కొత్త మంత్రి వ‌ర్గం ఏర్పాటు చేసుకుంటామ న్నారు., దీంతో అంద‌రూ పోతే.. మ‌న‌కు మాత్రం ఏమవుతుంది.. ఒక‌రిద్ద‌రు త‌ప్ప ! అని మంత్రులు అంద‌రూ మాన‌సికంగా రెడీ అయ్యారు.

అయితే.. జ‌గ‌న్ 2019లో చెప్పిన మాట‌ల‌ను మ‌రిచిపోయి.. దాదాపు 48 శాతం మంది పాత వారిని తాజా కేబినెట్‌లో కొన‌సా గించారు. దీనిపై మాజీ మంత్రులు ర‌గిలిపోతున్నారు. ఏదో ఒక విధంగా పార్టీలో ర‌గ‌డ సృష్టించాల‌ని.. వారు అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

తాజాగా నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ దూకుడు.. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. అంటే.. మాజీల్లో తీవ్ర అసం తృప్తి పెరిగిపోయింద‌ని.. వారు ఏక్ష‌ణ‌మైనా.. స‌ర్కారుపై యుద్ధానికి రెడీ అవ్వొచ్చ‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇంత‌కు ముందున్న ప‌రిస్థితిలో వారు దూకుడుగా ఉండే అవ‌కాశం లేద‌ని కూడా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లు కొన్ని స‌ర్వే చేశాయి.

తాజా మాజీ మంత్రుల‌తో జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌మాదం పొంచి ఉందా? అని ప్ర‌శ్నించింది. దీనికి ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాల‌ను ఆహ్వానించింది. దీనిలో బారీ ఎత్తున నెటిజ‌న్లు స్పందించారు. మాజీ మంత్రుల దెబ్బ‌తో జ‌గ‌న్ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరి కావ‌డం ఖాయ‌మ‌ని.. మెజారిటీ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. 70 శాతం మంది నెటిజ‌న్లు.. జ‌గ‌న్ స‌ర్కారుకు తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక‌, కేవ‌లం 23 శాతం మంది మాత్ర‌మే.. ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. ఏది వ‌చ్చినా.. జ‌గ‌న్ స‌మ‌ర్ధంగా ఎదుర్కొంటార‌ని.. పేర్కొన్నారు. మ‌రో 7 శాతం మంది మాత్రం ఈ విష‌యంపై త‌మ‌కు అవ‌గాహ‌న లేద‌ని చెప్పారు. దీంతో ఇప్పుడు మాజీల దెబ్బ‌ను ప్ర‌జ‌లే ఊహిస్తున్నార‌ని.. మ‌రి అధిష్టానం ఏం చేస్తుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.