Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: చంద్రబాబు అవినీతి పై సీబీఐ విచారణ?
By: Tupaki Desk | 27 Dec 2019 8:02 AM GMTగడిచిన ఐదేళ్ల లో అభివృద్ధి పేరిట దాదాపు 1.90 లక్షల కోట్లు ఏపీకి తీసుకొచ్చిన చంద్రబాబు అటు అమరావతి కట్టలేదు.. ఇటు అభివృద్ధి చేయలేదు. మరి ఆ డబ్బులన్నీ ఏం చేసినట్టు.. ఏపీ అప్పుల పాలు ఎందుకు అయ్యింది? ఇప్పుడు దీని పై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.
చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతిపై జగన్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను సీఎం జగన్ సమర్పించింది..ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వం లో కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సెక్రెటేరియట్ లో సీఎం జగన్ ను కలిసి ఈ నివేదిక అందజేసింది. కేబినెట్ మీటింగ్ కు కొద్ది నిమిషాల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. అమరావతిలో టీడీపీ నాయకులు కొన్న భూముల జాబితాను, వారి పేర్లను కూడా ఆర్థిక మంత్రి బుగ్గన ఈ నివేదికలో పొందు పరిచినట్టు తెలిసింది. మాజీ మంత్రులు నారాలోకేష్, పత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, చంద్రబాబు కుటుంబ సారథ్యంలోని హెరిటేజ్ గ్రూపుకు ఈ భూములు ఉన్నట్టు నివేదికలో ఉన్నట్టు సమాచారం.
ఈ కేబినెట్ సబ్ కమిటీ ప్రధానంగా అమరావతి భూముల్లో అంతర్గత వ్యాపారం, నీటిపారుదల ప్రాజెక్టులు, వివిధ ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపు వంటి అంశాలను పరిశీలించింది. చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలన్నింటిపై దర్యాప్తులో కమిటీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ , సిఐడి సహాయం తీసుకుంది. అంతిమంగా వివరణాత్మక నివేదికను తయారు చేసింది.
చంద్రబాబు చేసిన అవినీతి పై పూర్తి నివేదిక ను సీబీఐ కి పంపి ఆయన పై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం కోరనుందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ఈ నివేదిక ను వెలువరించి సీబీఐ దర్యాప్తునకు జగన్ కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది..