Begin typing your search above and press return to search.
జనసేన సభ లో జగన్ కు నమస్కారం ..!
By: Tupaki Desk | 6 Dec 2019 7:27 AM GMTసాధారణంగా ఏదైనా ఒక పార్టీ ఒక సభ ని ఏర్పాటు చేస్తే ఆ పార్టీ అధినేతని ప్రశంసించడం .. ఆయనకి నమస్కారం చెప్పడం మాములే. అందరిలాగా నేను కూడా అదే చెప్తే ఏంబాగుంటుంది అని అనుకుందో ఏమో కానీ , ఒక మహిళ జనసేన సభకి కి వచ్చి ..జనసేన అధినేత జగనన్నకు నమస్కారం, స్వాగతం అంటూ చెప్పింది. దీని తో అక్కడున్న వారందరు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత తాను చేసిన పొర పాటుని గుర్తించిన ఆ మహిళ , తప్పుని సరిదిద్దుకుంది.
అయితే, ఆ మహిళ ఆలా మాట్లాడగానే .. జనసేన పార్టీ వర్గాలతోపాటు పవన్ కల్యాణ్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది అని సమాచారం. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే .. చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. రాయలసీమ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా మదనపల్లిలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా కు చెందిన డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
పవన్ ఏర్పాటు చేసిన సమావేశానికి మహిళలు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు. ఈ సమయం లో ప్రస్తుతం రాష్ట్రం లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఒక మహిళ వేదికపైకి వచ్చి మాట్లాడిన సందర్భం లో ‘గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు జగనన్న గారికి’’ అంటూ మాట్లాడింది. దీనితో ఉలిక్కి పడిన జనసేన నేతలు, పార్టీ వర్గాలు.. ఆ మహిళ కు ఇది వైసీపీ మీటింగ్ కాదు.. జనసేన మీటింగ్ అని గుర్తు చేశారు. ఏదైనా కూడా మనసు లో జగనన్న ఉంటె పైకి పవన్ అన్న ఎలా వస్తాడు అని కొందరు వైసీపీ నేతలు దీని పై స్పందిస్తున్నారు.