Begin typing your search above and press return to search.

కరోనా పై జగన్ చెల్లెలు సంచలన వ్యాఖ్యలు ..ఏమన్నారంటే ?

By:  Tupaki Desk   |   19 March 2020 3:30 PM GMT
కరోనా పై జగన్ చెల్లెలు సంచలన వ్యాఖ్యలు ..ఏమన్నారంటే ?
X
కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచ దేశాల తో పాటుగా , భారత్ కూడా ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. కరోనా కి మందు లేకపోవడం తో ..కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి పలువురు ప్రముఖులు సెల‌బ్రిటీలు మొద‌లుకుని సామాన్యుల వ‌రకు త‌మ‌త‌మ ప‌రిధుల్లో వివ‌రిస్తున్నారు.

కరోనా వైరస్ సోకిన తరువాత అప్ర‌మ‌త్తం కావ‌డం కంటే....అసలు కరోనా మనకి సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయం పై సీఎం జ‌గ‌న్ చెల్లెలు, స్వర్గీయ వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె అయిన డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత కొన్ని చిట్కాలు చెప్పారు. క‌రోనా వైర‌స్‌ కు గురైన‌ప్ప‌టికీ, బాధిత రోగులు 80 శాతం వెంట‌నే కోలుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. స‌హ‌జంగా ఒళ్లు నొప్పులు, జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ తో బాధ‌ప‌డుతుంటే సంబంధిత మందులు పారాసిట‌మాల్‌, ఇత‌ర మందులు రోగి వాడుతార‌న్నారు. అయితే మందుల‌తో పాటు రోగికి ముఖ్యంగా విశ్రాంతి చాలా అవసరం అని డాక్ట‌ర్ సునీత తెలిపారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్నాయి అని అనుమానం వచ్చినా కూడా , అంద‌రికీ దూరంగా ఉండటం మంచిది అని ,అలా చేస్తే ఇత‌రుల‌కు వ్యాపించ‌కుండా ఉంటుంద‌న్నారు.

ఎవరితో మాట్లాడకుండా రెండు వారాల పాటు ఒక గ‌దిలో ఒంట‌రిగా గ‌డ‌ప‌డం అంటే అనుకున్నంత సులభం కాదు అని, కానీ త‌ప్ప‌ద‌న్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలుంటే 14-15 రోజులు క్వారంటైన్‌ లో ఉండటం త‌ప్ప‌నిస‌రి అన్నారు. ఎదురెదురుగా కూర్చోవ‌డం, మాట్లాడ‌టం మంచిది కాదు అని తెలిపారు. అయితే ఫోన్లలో మాట్లాడుకోవ‌చ్చ‌ని, పాట‌లు వింటూ గ‌డ‌ప‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్ సునీత తెలిపారు. వీటితో పాటు మెడిటేషన్ అనేది చాలా ముఖ్య‌మైంద‌న్నారు. మెడిటేషన్ , యోగా ద్వారా మానిస‌క ధైర్యాన్ని, స్థైర్యాన్ని పొంద‌వ‌చ్చ‌న్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన పౌష్టికాహారం తిన‌డం చాలా ముఖ్య‌మ‌ని , అలాగే ఏ పని చేసే ముందు అయినా కూడా చేతులు కడుక్కోవడాన్ని అల‌వాటుగా చేసుకోవాలని డాక్ట‌ర్ సునీత చెప్పుకొచ్చారు.