Begin typing your search above and press return to search.

బావ పనైపోయింది.. ఇప్పుడు బామ్మర్ది వంతు.. ఇక దబిడిదిబిడే

By:  Tupaki Desk   |   11 March 2020 5:30 PM GMT
బావ పనైపోయింది.. ఇప్పుడు బామ్మర్ది వంతు.. ఇక దబిడిదిబిడే
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడంత జై జగన్.. జై వైఎస్సార్సీపీ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఈ నేపథ్యం చంద్రబాబు వర్గమంతా జగన్ తన వైపునకు తిప్పేసుకుంటుండగా ఇప్పుడు తాజాగా చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వంతు మొదలైంది. ఆయన సన్నిహితులు, ఆయన అనుచరుల పై ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఫోకస్ పడింది. బాలకృష్ణ బలగాన్ని తమ వైపునకు ఆకర్షించే పనిలో అధికార పార్టీ పడింది. ఆ క్రమంలో బాలకృష్ణకు షాకిస్తూ ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగన్ పార్టీలో చేరిపోయాడు. మొదటి నుంచి రాజకీయాల్లో బాలయ్యను గురువుగా భావించే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి టీడీపీకి బైబై చెప్పేసి జై జగన్ అనడంతో టీడీపీ లో కలవరం మొదలైంది. ముఖ్యంగా బాలకృష్ణ కిమ్మనడం లేదు.

ఇన్నాళ్లు చంద్రబాబు సోపతిగాళ్లను, టీడీపీలోని కీలక నాయకులకు జగన్ ద్వారాలు తెరిచాడు. ఇప్పుడు ఆయన బామ్మర్ది బాలకృష్ణపై జగన్ ఫోకస్ పడింది. దీంతో అతడికి స్నేహితుడిగా చెప్పుకునే కనిగిరి మాజీ ఎమ్మెల్యే బాబూరావును తమ పార్టీలోకి చేర్చుకుని బాలకృష్ణకు జగన్ ఊహించని షాకిచ్చాడు. ఆయన వైఎస్సార్సీపీ లో చేరిపోవడం బాలకృష్ణ తో పాటు ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగింది. 2014లో బాలయ్య సహకారంతోనే కనిగిరి టీడీపీ టికెట్ తెచ్చుకున్న బాబూరావు ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అయితే 2019 లో చంద్రబాబుకు ఆయనకు కనిగిరి నుంచి కాకుండా మరో స్థానం దర్శి నుంచి టికెట్ కేటాయించగా బాలకృష్ణ నచ్చజెప్పడంతో పార్టీలో కొనసాగారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీంతో చాలాకాలంగా పార్టీ వ్యవహారాలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న బాబూరావు వెంటనే బాలకృష్ణకు షాకిస్తూ జగన్ పార్టీలో చేరిపోయాడు.

అయితే గతంలో బాబురావు తనకు రాజకీయాల కంటే బాలయ్య తో సంబంధాల ముఖ్యమని పేర్కొన్న ఆయనే పార్టీ మారడం తో చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీలోకి చేరడానికి ఇదే మంచి సమయమని బాబురావు భావించి చేరిపోయారు. కాపు సామాజికవర్గానికి చెందిన కదిరి బాబురావు చేరికతో ప్రకాశం జిల్లాలో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అధికార పార్టీ భావిస్తోంది. మొత్తంగా తనకు అత్యంత సన్నిహితుడైన బాలయ్యను చేర్చుకోవడంలో జగన్ సఫలమయ్యాడు. తన బావమరిది బాలయ్య బాబురావును వైఎస్సార్సీపీలోకి పంపించడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఇన్నాళ్లు తనకు తగిలిన షాక్ బామ్మర్దికి కూడా తగలడంతో చంద్రబాబు ఏం చేయలేని స్థితికి చేరాడు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో ఒక్కొక్కరుగా టీడీపీని వీడి అధికార వైఎస్సార్సీపీలో చేరుతుండడం తో టీడీపీలో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో మరింత మంది కూడా పార్టీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కీలకమైన హిందూపురం స్థానంలో బాలకృష్ణ గెలవడంతో ఇది జగన్ జీర్ణించుకోలేకపోయాడు.

అల్లుడు నారా లోకేశ్ తో పాటు మామ బాలకృష్ణను ఓడించాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన కొద్దిపాటిలో బాలయ్య తప్పించుకున్నాడు. దీంతో బాలయ్యను ఏదో ఒక విధంగా తిప్పలు పెట్టాలనే ప్లాన్ లో భాగంగా జగన్ వ్యూహం రచిస్తున్నాడు. ఈ క్రమంలోనే హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యకు ప్రాధాన్యం తగ్గింది. ఇటీవల జరిగిన లేపాక్షి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఫొటో పెట్టకపోవడం విడ్డూరం. ఇక భవిష్యత్ లో బాలకృష్ణకు దబిడిదిబిడే.