Begin typing your search above and press return to search.
తెలంగాణ ఎన్నికల్లో జగపతి సపోర్టెవరికంటే..
By: Tupaki Desk | 22 Nov 2018 2:32 PM GMTఎన్నికలు వస్తున్నాయంటే సినీ రంగంలోనూ సందడి మొదలవుతుంది. సినీ తారల గ్లామర్ ను ఉపయోగించుకోవడానికి రాజకీయ పార్టీలు గట్టి ప్రయత్నమే చేస్తాయి. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న సినిమా వాళ్లు కూడా తమంతట తాముగా వెళ్లి ప్రచారంలో పాల్గొంటూ ఉంటారు. ఐతే తెలంగాణ ఎన్నికల్లో సినీ తారల సందడి కొంచెం తక్కువగానే ఉంది. చాలా వరకు సినీ తారలు న్యూట్రల్ గా ఉంటున్నారు. ఎవ్వరికీ మద్దతు ప్రకటించట్లేదు. ఐతే సీనియర్ హీరో జగపతిబాబు మాత్రం మొహమాటం పక్కన పెట్టి ఓ అభ్యర్థికి మద్దతు ప్రకటించాడు. ఆమే నందమూరి హరికృష్ణ తనయురాలు సుహాసిని.
సుహాసిని మహాకూటమి మద్దతుతో టీడీపీ కూకట్ పల్లి అభ్యర్ధిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే .జగపతి బాబు.. ఆమెకు మద్దతు తెలిపారు. మామూలుగా సినీ తారలు జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు. ఐతే జగపతిబాబు మాత్రం అక్కడున్న తన ఇంటిని అమ్మేసి కూకట్ పల్లిలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ తీసుకుని అక్కడే ఉంటున్నారు. ఆయనున్న ఏరియాలోనే సుహాసిని పోటీ చేస్తుండగా.. ఆమెకు మద్దతు ప్రకటించాడు. ‘'సుహాసిని నిజాయితీ కలిగిన వ్యక్తి. ప్రజలను నిబద్దతతో సేవ చేయగలదని నేను నమ్ముతున్నాను. కూకట్ పల్లి అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న ఆమెను ఆ నియోజక వర్గ ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నా’’ అంటూ జగపతి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.జగపతి కుటుంబం ముందు నుంచి తెలుగుదేశం మద్దతుదారన్న సంగతి తెలిసిందే.జగపతిబాబు ఇటీవలే చంద్రబాబు నాయుడిని కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.