Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి కోరికల చిట్టా బారెడు
By: Tupaki Desk | 8 Jan 2019 9:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో జగ్గారెడ్డి పేరు వినగానే మాస్ లీడర్ గుర్తుకొస్తారు. కానీ ప్రస్తుతం ఆయన పంథాకు విరుద్ధంగా జగ్గారెడ్డి ఆచితుచి వ్యవహరిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్నవారు సైతం ఓడినా జగ్గారెడ్డి మాత్రం సంగారెడ్డిలో గెలిచి సత్తా చాటారు.
తాజాగా తెలంగాణలో ఎన్నికల్లో ఓటమి పై టీపీసీసీ నిర్వహించిన సమీక్షలో ఆయన తన నిర్ణయాలను వెల్లడించారు. అంతేకాకుండా అధిష్టానానికి తన కోరికల చిట్టాను ఉంచారు. తనకు, తాన భార్య పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని, మెదక్ ఎంపీ టికెట్ తన భార్య నిర్మలకు ఇస్తే గెలిపించుకుంటానని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లోనూ పొత్తు ఉండాల్సిందేనని పట్టుబట్టారు.
మరో వైపు తాను పార్టీ మారబోనని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జగ్గారెడ్డి కేసీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట తాను ముఖ్యమంత్రి విమర్శించబోనని బాహాటంగా చెప్పారు. నియోజకవర్గంలో మంచి పనులు చేస్తే కేసీఆర్ కు ఘనస్వాగతం పలుకుతానని చెప్పుకొచ్చారు.
కాగా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో గెలిచినందుకు తనకు సీఎల్పీ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతుండటంతో పలువురు నేతలు అవాక్కవుతున్నారు. లోక్ సభ ఎన్నికలు త్వరలోనే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలని భావిస్తోంది. టీఆర్ఎస్ కూడా 16 ఎంపీ స్థానాలు గెలువాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి అధిష్టానం ముందు పెట్టిన డిమాండ్లపై ఎలా స్పందిస్తుందోనని చర్చనీయాంశంగా మారింది. ఆచితుచి వ్యవహరిస్తున్న జగ్గారెడ్డికి అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.