Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం: మ‌హా అంటే చంపేస్తారు అంతేక‌దా?

By:  Tupaki Desk   |   2 March 2019 8:23 AM GMT
జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం: మ‌హా అంటే చంపేస్తారు అంతేక‌దా?
X
కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్ ఎమ్మెల్యే - గ‌త కొద్దికాలంగా టీఆర్ ఎస్ పట్ల సానుకూల వ్యాఖ్య‌లు చేస్తూ....ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావుపై మాత్రం విరుచుకుప‌డుతున్న జగ్గారెడ్డి తాజాగా మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చారు. హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మ‌ళ్లీ క‌ల‌కం రేపే వ్యాఖ్య‌లు చేశారు. సింగూరు నీళ్ల త‌ర‌లింపు గురించి స్పందించిన జ‌గ్గారెడ్డి ఆనాటి మంత్రి హరీశ్‌ రావు నీటిని తరలించినప్పుడు ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి ఎటుపోయారని ప్ర‌శ్నించారు. ``హరీశ్ రావు ఒక్క‌డే నీటిని తరలించారని నేను అనుకున్న..కానీ కేటీఆర్ - కవిత - వినోద్ - ఈటెల ఉన్నారని టీఆర్ ఎస్‌ నేతలు అంటున్నారు. ఇది నిజమా కాదా.. ఆ నలుగురు సమాధానం చెప్పాలి`` అని డిమాండ్ చేశారు.

సంగారెడ్డి ప్రజలకు తాగేందుకు నీళ్లు లేవని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. ``నేను రాజకీయాలు మాట్లాడటం లేదు. ప్రజల కోసమే మాట్లాడుతున్నాను. నీళ్ల పంచాయితీ ఒడిసిన తర్వాత పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. నేను మాట్లాడేందుకు రెడీ``అని ప్ర‌క‌టించారు. త‌ను అరెస్టైన స‌మ‌యంలో జైల్లోనే ఉంచేందుకు హరీశ్‌ రావు మనుషులు ప్రయత్నం చేశారని మ‌రోమారు ఆయ‌న ఆరోపించారు. ప్రజల సమస్యలు మాట్లాడితే...త‌న‌ను పర్సనల్‌ గా టార్గెట్ చేస్తున్నారని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ``క్యారెక్టర్ లేనివాళ్లు నాపై విమర్శలు చేయ‌డ‌మా? నలభై సంవ‌త్స‌రాల కింద నేనేంటి..కేసీఆర్ - హరీశ్‌ రావు - కేటీఆర్ - టీఆర్ ఎస్ నేతలు ఎలా ఉన్నారో డాక్యుమెంటరీ తీద్దామా? నా స్టోరీ మీరు చెప్పండి...మీ స్టోరీ లేంటో నేను ప్రజలకు చెబుతా`` అని జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు.

సమస్యలపై మాట్లాడితే పోలీసులతో అణిచివేస్తారా అని జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు. `` ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తుంటే...నాపై కేసులు పెడతారు. పోలీసులతో చంపిస్తారు..అంతకంటే ఇంకేం చేస్తారు?`` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ ను ఎందుకు తిట్టడంలేదని టీఆరెస్ నేతలు అనడం ఆశ్యర్యం కల్గుతుందన్నారు. సింగూరు నీటి విష‌యంలో జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాన‌ని జ‌గ్గారెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలే రోడ్డు మీదకొస్తారని ఆయ‌న ప్ర‌క‌టించారు.