Begin typing your search above and press return to search.

హ‌రీష్‌ రావు తో కేసీఆర్‌ కు డేంజ‌ర్ - జ‌గ్గారెడ్డి

By:  Tupaki Desk   |   13 Feb 2019 12:20 PM GMT
హ‌రీష్‌ రావు తో కేసీఆర్‌ కు డేంజ‌ర్ - జ‌గ్గారెడ్డి
X
ప‌ద‌వికి ఏ ఎస‌రు లేకున్నా ప్రాధాన్య‌త‌లో మాత్రం టీఆర్ ఎస్‌ లో హ‌రీష్‌ రావుకు అన్యాయం జ‌రిగిన‌ట్టు ఇటీవ‌ల పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. దానికి త‌గ్గ‌ట్టే ఇటీవ‌ల కొన్ని ప‌రిణామాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ఏ ప్రాజెక్టుల స‌మీక్ష‌లోనూ హ‌రీష్‌ రావు క‌నిపించ‌లేదు. పైగా ఒక ముఖ్య‌మైన ప‌ద‌వికి కూడా హ‌రీష్ రాజీనామా చేశారు. మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్క‌ద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీట‌న్నింటి నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌ లో హ‌రీష్ క‌చ్చితంగా కంఫ‌ర్ట్‌ గా లేడ‌ని తెగ గాసిప్‌ లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నుంచి కూడా హ‌రీష్‌ పై దాడి జ‌ర‌గ‌డం విశేషం.

కాంగ్రెస్ ఆగ్రెసివ్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి గ‌త ఎన్నిక‌ల అనంత‌రం కేసీఆర్ ప‌ట్ల చాలా సాఫ్ట్ టోన్‌ తో మాట్లాడుతున్నారు. ఎవ‌రేమ‌నుకున్నా నా నియోజ‌క‌వ‌ర్గం ముఖ్యం. ముఖ్య‌మంత్రిని క‌లుస్తా అంటున్నాడు. అదంతా ఓకే గాని ఈరోజు కేసీఆర్ మార్కులు కొట్టేయ‌డానికి అన్నాడో ఇంకెందుకు అన్నాడో గానీ... హ‌రీష్‌ రావుపై దారుణ‌మైన కామెంట్లు చేశారు.

సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులను హరీష్ రావు ఎండబెట్టారని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. హరీష్ రావు చేసిన త‌ప్పుల వ‌ల్లే ప్రస్తుతం మంజీర ఎండిపోయిందని ధ్వజమెత్తారు. తాగునీటి కోసం మంజీర నీటిని ఎందుకు తరలించారని అడిగారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ముఖ్య‌మంత్రికి తెలియ‌కుండా హరీష్ రావు ఇదంతా చేశార‌ని జ‌గ్గారెడ్డి విమ‌ర్శించ‌డం గ‌మనార్హం. కేసీఆర్ అయితే ఇలా చేయ‌డ‌ని - ఆయ‌న‌కు ఈ విష‌యం తెలిసి ఉంటే క‌చ్చితంగా ఆపి ఉండేవార‌ని కేసీఆర్ ని ఓ రేంజ్‌ లో క‌వ‌ర్ చేశారు జ‌గ్గారెడ్డి.

మంజీరా నీళ్లు ఉమ్మడి మెదక్ ప్రజలవి వ్యాఖ్యానించిన జ‌గ్గారెడ్డి హ‌రీష్‌ రావు వ‌ల్ల మెదక్‌ జిల్లా ప్రజలకు - ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు పెద్ద డేంజ‌ర్ అన్నారు. అస‌లు మిషన్ భగీరథ ప‌థ‌కానికి తూట్లు పొడిచింది కూడా హ‌రీష్‌ రావు ఆయ‌న ఆరోపించారు. ఈ నీటి దోపిడీ విష‌య‌మై హరీష్ రావు మెదక్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు జ‌గ్గారెడ్డి. ప్ర‌భుత్వం సంగారెడ్డికి నీటి కోసం రూ.10 కోట్లు విడుదల చేయాల‌ని కోరారు. తాను గెలిస్తే ఇలాంటివి అడుగుతాను అనే హరీష్ రావు నన్ను ఎన్నిక‌ల‌పుడు ఓడించేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా... ఎన్నిక‌ల‌కు ముందు దొంగ పాస్ పోర్ట్ కేసులో జ‌గ్గారెడ్డి అరెస్టు అయ్యారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంతో పెద్ద‌గొడ‌వ‌కే దిగారు. తీరా క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌లను గెలిచినా కాంగ్రెస్ ఓడిపోవ‌డంతో ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ ను జ‌గ్గారెడ్డి ప‌ల్లెత్తు మాట అన‌క‌పోగా... పూర్తిగా స‌రెండ‌ర్ అయ్యారు.