Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు జగ్గారెడ్డి కొత్త టార్గెట్
By: Tupaki Desk | 28 Jun 2016 8:03 AM GMTకాంగ్రెస్ పార్టీ నాయకుడు - మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈ దఫా పరిపాలనపై కాకుండా గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సంగారెడ్డి సమస్యను నెత్తికెత్తుకున్నారు. ఈ క్రమంలో ఆయన కేసీఆర్ కు టార్గెట్ విధించారు. అంతేకాకుండా కొత్త తరహా ఆందోళనను ప్రకటించారు.
మంజీర డ్యాంను నీటితో నింపి సంగారెడ్డి - జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గంలో ప్రజలందరికి మంజీర నీరందించిన ఘనత తనదని చెప్పుకొచ్చారు. అయితే తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెరువులన్ని ఎండిపోయాయని ఆరోపించారు. జిల్లా ప్రజలు తాగునీటికి అల్లాడుతున్న 6 నుండి 7 నియోజకవర్గాల్లో నీరందక తీవ్ర దుర్బిక్షం నెలకోందని కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రంగురంగుల ప్రకటనలతో వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు చూపుతున్నారన్నారు.
ఎన్నికలకు ముందు మోకాలు అడ్డుపెట్టి గోదావరి నీటినందిస్తామన్న కేసీఆర్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యారని జగ్గారెడ్డి అన్నారు. రెండు సంవత్సరాలు కావస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని మాటల గారడితో ప్రభుత్వాన్నిసాగదీస్తున్నారని మండిపడ్డారు. తనను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చిన జిల్లాలో తాగునీరు - సాగు నీటితో ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రజలను - రైతులను కాపాడే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇంటా గెలిచి రచ్చ గెలవలన్న సామెత కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. సింగూరు - మంజీరలో నీరు నింపి సంగారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వంఇచ్చిన హామిలపై ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలను ఉదృతం చేస్తామన్నారు. 10 రోజుల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోక పోతే 5వేల మందితో కలెక్టరేట్ వద్ద ధర్నా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు.