Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి అనే వీరాధివీరుడు వచ్చాడు తెలుసా కేసీఆర్?
By: Tupaki Desk | 8 Jun 2021 2:50 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల గురించి, ఆయన అడుగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కేసీఆర్ గేమ్ ప్లాన్ వల్ల ప్రతిపక్షాలు ఒక్కొక్కటిగా బలహీనపడుతుంటే కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఎలా ఢీకొట్టాలో, గద్దె దించాలో తనకు బాగా తెలుసన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీలోని అంతర్గత రాజకీయాల గురించి కూడా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
గాంధీభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాను పీసీసీ అధ్యక్ష పదవిని అడుగుతున్నప్పటికీ ఢిల్లీ చర్చల్లో తన పేరు లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్ ను అడ్డగించిన చరిత్ర తనది అని చెప్పుకొచ్చారు. కాంగ్రెష్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మణిక్కం ఠాగూర్‌కు తన సత్తా తెలువక పోవడం తన దురదృష్టం అని పేర్కొన్నారు. ఠాగూర్ తన పైన చిన్న చూపు చూస్తున్నారని.. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ నన్ను గుర్తించకపోవడం నా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కేసీఆర్ ను అడ్డుకోవడం తనతోనే సాధ్యమని..కేసీఆర్ ను గద్దె దింపే మెడిసిన్ తన దగ్గర ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చెబుతున్నది కామెడీ కాదు సీరియస్ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సీనియర్ నేత వి.హనుమంతరావును కొందరు బెదిరించడాన్ని ఖండిస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు. బెదిరించేవారు ఫోన్ నంబర్ పెట్టాలని.. తాను వచ్చి మాట్లాడతానని వెల్లడించారు. ఫేస్ బుక్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే దానికి తగ్గట్టుగా రియాక్షన్ ఉంటుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను సమర్థవంతులైన నేతకే అప్పగించాలని జగ్గారెడ్డి కోరారు. అయితే, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.