Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌ లో మ‌రో వికెట్‌..హ‌రీష్‌ తో ఆ ఎమ్మెల్యే భేటీ...!

By:  Tupaki Desk   |   19 Sep 2019 12:11 PM GMT
టీ కాంగ్రెస్‌ లో మ‌రో వికెట్‌..హ‌రీష్‌ తో ఆ ఎమ్మెల్యే భేటీ...!
X
తెలంగాణ కాంగ్రెస్‌ లో రోజుకో వికెట్స్‌ డౌన్ అవుతున్నాయి. మొన్న‌నే తెలంగాణ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి టీ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌ రావు తో భేటీ అయి మంత‌నాలు జ‌రుప‌గా - ఇప్పుడు అదే బాట‌లో కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే - ఒక‌ప్ప‌టి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్‌ రెడ్డి అలియాస్ జ‌గ్గారెడ్డి భేటీ కావ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం క‌లిగిస్తుంది. జ‌గ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర స‌మితిలో క్రియాశీల‌క పాత్ర పోషించి త‌రువాత ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. కానీ కాంగ్రెస్ నేత‌ - ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ఉన్న స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పిలుపు మేర‌కు జ‌గ్గారెడ్డి - దుగ్యాల శ్రీ‌నివాస‌రావుతో పాటు 10మంది ఎమ్మెల్యేలు టీ ఆర్ ఎస్‌ కు గుడ్‌ బై చెప్పి కేసీఆర్‌ ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టి కాంగ్రెస్‌ లో చేరిపోయారు.

త‌రువాత టీఆర్ ఎస్ నేత‌ల‌ను తూర్పార బెట్ట‌డ‌మే లక్ష్యంగా పెట్టుకున్న తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఈరోజు హరీష్‌ రావుతో భేటీ కావ‌డం సంచ‌న‌లం క‌లిగిస్తుంది. కొన్నేళ్లుగా హ‌రీష్‌ రావు - జ‌గ్గారెడ్డి న‌డుమ ప‌చ్చ‌గ‌డ్డ వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో విభేదాలు ఉండేవి. ఒక‌రు ఉప్పు అయితే మ‌రోక‌రు నిప్పు.. ఒక‌రు నిప్పు అయితే ఒక‌రు ఉప్పై మండేవారు. 14 ఏళ్లు ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉన్న ఈ ఇద్ద‌రు నేత‌లు ఈరోజు భేటీ అయ్యి అంద‌రిని షాక్‌కు గురి చేశారు. గ‌త డిసెంబ‌ర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా జ‌గ్గారెడ్డిని సంగారెడ్డిలో ఓడించేందుకు హ‌రీష్ విఫ‌ల ప్ర‌య‌త్నాలు చేశారు.

అయితే జ‌గ్గారెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. కాంగ్రెస్‌ ను త‌ల‌పైకి ఎత్తుకుంటునే కేసీఆర్‌ ను మెచ్చుకునేవారు. ఇలా సాగిన జ‌గ్గారెడ్డి ప‌య‌నం ఇప్పుడు ఏకంగా బ‌ద్ద‌శ‌త్రువుగా ఉండే హరీష్‌ రావుతో భేటీ కావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీస్తుంది. 14 ఏళ్ల‌ త‌రువాత ఇద్ద‌రు ఏకాంతంగా క‌లుసుకోవ‌డం ప‌ట్ల రాజ‌కీయ కార‌ణాల లేక అభివృద్దిపై చ‌ర్చ‌లు జ‌రిగాయా అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. అయితే సంగారెడ్డి అభివృద్ధి కోసం హ‌రీష్‌ రావును క‌లువ‌లేద‌ని రాజ‌కీయ ఆంశాల‌పైనే చ‌ర్చ జ‌రిగింద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి... ఏదేమైనా ఇద్ద‌రు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు భేటీ కావ‌డం రాజ‌కీయ దుమారం రేగుతోంది. ఇక ఇప్ప‌టికే 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కండువాలు మార్చేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ్గారెడ్డి కూడా పార్టీ మారితే పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన పనేం లేద‌న్న‌ట్టుగా కాంగ్రెస్ రాజ‌కీయాలు ఉన్నాయి.