Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి రాక కాంగ్రెస్ కు శుభసూచకం
By: Tupaki Desk | 1 Sep 2015 6:28 PM GMTకాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లే వారు తప్పితే ఆ పార్టీలోకి వచ్చే వారిని గత మూడు నాలుగేళ్లుగా చూడలేదు. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రరెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత నుంచి కాంగ్రెస్ నుంచి వలసలు తీవ్రమయ్యాయి. అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి బయటకు తప్పితే లోపలికి వచ్చిన నాయకుడు కరువయ్యాడు. ఈ క్రమంలో ఆ పార్టీలోకి వచ్చిన మొదటి వ్యక్తిగా జగ్గారెడ్డి ని చెప్పుకోవచ్చు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వెళ్లి ఇప్పుడు ఆయన మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. ఆ పార్టీ అధికారంలో లేని సమయంలో.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆయన మళ్లీ సొంత గూటికి రావడం విశేషం. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినా రాకపోయినా స్వతంత్రంగా ఉన్నా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. అయితే, కాంగ్రెస్ అధికారంలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆ పార్టీలోకి తిరిగి రావడం మాత్రం విశేషమే. ఇది భవిష్యత్తులో ఆ పార్టీ పరిస్థితిని సూచిస్తోంది.
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీలోకి వెళ్లిన నాయకులు కూడా ఎందుకు వచ్చాంరా బాబూ అని అనుకునే పరిస్థితి ఇప్పుడిప్పుడే మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పరిస్థితిలో పూర్తి స్పష్టత వస్తుంది. ఆ తర్వాత టీఆర్ ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలస వెళ్లడం మొదలువుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారు ఎక్కిన వాళ్లు కూడా మళ్లీ తిరిగి చేయందుకునే రోజులు ముందున్నాయని, ఇందుకు జగ్గారెడ్డి రాక ఒక సంకేతమని వివరిస్తున్నారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘన విజయం సాధిస్తే ఈ పరిణామం మరికొంతకాలం వాయిదా పడుతుందని, సాధారణ విజయం సాధించినా, ఓటమి పాలైనా వలసలు జోరందుకోవడం ఖాయమని వివరిస్తున్నారు.