Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో 'రెడ్డ'ప్పలే దిక్కప్పా?
By: Tupaki Desk | 15 Feb 2020 7:30 PM GMTకాంగ్రెస్ అంటే రెడ్లు.. రెడ్లు అంటే కాంగ్రెస్.. అనాధిగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల గుత్తాధిపత్యంలోనే మగ్గిపోయింది. మహిష్మతికి కట్టప్పలాగా.. కాంగ్రెస్ కు రెడ్లు కట్టుబానిసలు మారిపోయారు. తనకు ఎంతో లైఫ్ ఇచ్చిన తెలుగుదేశంలో వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డి సైతం తమ రెడ్ల పార్టీలోనే భవిష్యత్ ఉందని చేరిన పరిస్థితి చూశాం.. కాంగ్రెస్ అంటేనే అదో మహాసముద్రం.. వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు. కానీ బయటోడు వస్తే మాత్రం కలిసి ఎగబడుతారు.. ఘనత వహించిన మన కాంగ్రెస్ పార్టీ దుస్థితిదీ. అవును ఇప్పుడు కాంగ్రెస్ లో ‘రెడ్డి రాజకీయం’ పీక్ స్టేజ్ లో నడుస్తోంది.
తాజాగా పీసీసీ చీఫ్ రేసు తెలంగాణ కాంగ్రెస్ సెగలు పుట్టిస్తోంది. ఈ పోస్టు కోసం దాదాపు 10 మంది వరకు పోటీపడుతున్నారు. వింతైన దరఖాస్తులు, కోరికలతో ఇటీవలు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ బరిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. ‘పదవీ కోసం పోటీ పడుతున్న రెడ్డి సామాజికవర్గం నాయకులంతా ఒక సమావేశం పెట్టుకొని, ఒక నాయకుడి పేరును ఏకగ్రీవంగా ఖరారు చేయాలని’ జగ్గారెడ్డి ఓ ప్రతిపాదన పెట్టాడట.. రెడ్డి సామాజిక వర్గం నాయకులందరూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్హులే అని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కల్లోలానికి దారితీశాయి..
తెలంగాణ కాంగ్రెస్ లో ఎంతో మంది ఉద్దండ పిండాలున్నారు. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన మన వీహెచ్ తాత.. ఇప్పటికే 80+ వయసులోనూ అర్జున్ రెడ్డిలా బుల్లెట్ నడిపిస్తూ కాంగ్రెస్ ఐకాన్ గా కార్యకర్తలు నేతలను ఉరకెలెత్తిస్తున్నాడు. ఇక శ్రీధర్ బాబు కూడా సాఫ్ట్ నేతగా అందరితోనూ కలిసిపోయే రెడ్డియేతర నేతగా పేరొందారు.. వీరే కాదు.. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఎస్సీ వర్గానికి చెందిన ‘భట్టి’ కూడా పీసీసీ రేసులో ఉన్నారు.. ఇంకా చాలా మంది దళిత, బీసీ వర్గాల నేతలు ఈసారి పీసీసీ పదవిని తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే తరతరాలుగా తెలంగాణ కాంగ్రెస్ పై ఆధిపత్యం చెలాయిస్తున్న సీనియర్ రెడ్డి నేతలంతా తమలో తమకే ఇవ్వాలని లాబీయింగ్ మొదలు పెట్టారు. ఉత్తమ్ హయాంలో వరుస ఓటముల తో ఇక ఆయనను దింపేసి రేవంత్ రెడ్డిని చేస్తారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. రాహుల్ గాంధీ సపోర్ట్ కూడా రేవంత్ కు ఉందట.. రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం దృష్టిసారించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీలోని సీనియర్లు అంతా రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం తాత్కాలికంగా ప్రక్రియను వాయిదా వేసింది. కోమటిరెడ్డి ఇప్పటికే ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారట.. రేవంత్ ను ఈయన అడ్డుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి పీసీసీ ఛీప్ లో బలంగా కొట్లాడుతోంది ముగ్గురు రెడ్డీలే కావడం విశేషం. ఇందులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉండగా.. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా కాబోయే పీసీసీ ఛీప్ ‘రెడ్డి’నే అని ఖాయం చేసుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది.
పీసీసీ పీఠం రెడ్లకే అని కన్ఫం కావడంతో ఇక పార్టీకి అండగా ఉంటున్న బీసీలు, ఎస్సీ నేతల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మరి రెడ్డిలలో ఐక్యత ఉందా అంటే అదీ లేదు.. పీసీసీ పీఠం కోసం ఉత్తమ్, కోమటి రెడ్డి బ్రదర్స్ కొట్టుకున్నారు. ఇక రేవంత్ కు ఇద్దామంటే రేవంత్ వర్సెస్ నల్గొండ రెడ్డి నేతల వార్ నడిచింది. ఇలా రెడ్డీ నేతలు ఇతరులకు ఇవ్వడానికి ఒప్పుకోకుండా తమలో తాము అంగీకరించకుండా చేస్తున్న రాజకీయం తెలంగాణ కాంగ్రెస్ లో వేడి పుట్టిస్తోంది