Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డికి కోపమొచ్చింది.. రేవంత్ కూడా ఆ తప్పు చేయకూడదు కదా?
By: Tupaki Desk | 27 Dec 2021 9:33 AM GMTదొందూ దొందే అన్నట్లు ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు. తప్పు ఒకసారి జరిగితే ఫర్లేదు. పదే పదే జరగటం ఏ మాత్రం బాగోదు. బలమైన రాజకీయ ప్రత్యర్థి పోరాడే వేళలో.. కొన్ని తప్పులు చోటుచేసుకోకుండా ఉండటం చాలా అవసరం. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు తరచూ చేసే పొరపాట్లు వారిలోని అనైక్యతను బట్టబయలు చేసేలా ఉంటుంది. నిజానికి ఏ పార్టీలో అయినా అంతర్గత రచ్చ లేకుండా ఉంటుందా? కానీ.. అవేమీ బయటకు రావు. కాంగ్రెస్ మాత్రం మరెవరికీ అవకాశం ఇవ్వకుండావారికి వారే.. బయటకు చెప్పేసుకుంటూ ఉంటారు.
తాజాగా రేవంత్ - జగ్గారెడ్డి మధ్య మరోసారి పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రికేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో ఈ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే కేసీఆర్ ఫాంహౌస్ లో వరి పండిస్తున్నారని.. సోమవారం మరిన్ని విషయాలు బయటపెడతానని చెప్పిన రేవంత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ యాక్టివిటీలు తగ్గిపోయాయని.. ఎక్కడ చూసినా.. టీఆర్ఎస్ -బీజేపీ మధ్య లడాయి కనిపిస్తున్న వేళ.. రచ్చబండతో మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నారు.
అదిలోనే హంసపాదు అన్న రీతిలో రచ్చబండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి.. ఆ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాంటిది తనను సంప్రదించకుండానే రేవంత్ ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ ఆయన మండిపడుతున్నారు. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసిన జగ్గారెడ్డి.. తనతో చర్చించకుండానే రేవంత్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తాను పాల్గొనని స్పష్టం చేశారు.
ఈ ఎపిసోడ్ లో రేవంత్ తప్పు ఎంతన్నది చూస్తే.. ఆయనకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టటం సుతారం ఇష్టం లేని సీనియర్ నేతల తీరు తెలిసిందే. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటూనే అందరిని కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ రేవంత్ అలాంటి పని ఎందుకు చేయటం లేదన్నది ఇప్పుడు ప్రశ్న. జగ్గారెడ్డి విషయానికి వస్తే.. రేవంత్ తనతో చర్చించకుండా రచ్చబండ కార్యక్రమాన్ని షురూ చేస్తే.. పార్టీ కోసం ఆయనతో కలిసి పని చేసి.. పార్టీ వేదికలో ఆయన తీరును తప్పు పట్టాలి. అందుకు భిన్నంగా ప్రకటనలు విడుదల చేస్తే.. పార్టీలోని లొల్లి రోడ్డు మీదకు వస్తుందన్న విషయాన్ని ఆయన ఎలా మర్చిపోతారు? కలుపుకుపోవాల్సిన రేవంత్ కలుపుకుపోకపోవటం.. కలుపుకు వెళ్లని రేవంత్ మీద జగ్గారెడ్డి గుస్సా కావటం దొందూ దొందే అన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు.