Begin typing your search above and press return to search.
సీఎం చెప్పారు.. కానీ ఫ్రస్ట్రేషన్ ఆగడం లేదే
By: Tupaki Desk | 26 May 2022 2:30 PM GMTమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ రాజులు కానీ ఎవ్వరయినా ప్రజా క్షేత్రాన ఒక్కటే ! విపక్షంలో ఉన్నప్పుడు అన్నీ సావధానంగానే విన్నారు. కానీ ఇప్పుడు జగన్ చెప్పినా కూడా ఎవ్వరూ తగ్గడం లేదు. అంటే అధికారం నిలుపుకునేందుకు ఎవ్వరూ తాపత్రయ పడడం లేదు. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేతకు మింగుడు పడని విషయం. తాజాగా నిన్నటి వేళ బొబ్బిలి ఎమ్మెల్యే అప్పలనాయుడు వివాదంలో ఇరుక్కున్నారు. మొన్నటి వేళ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండ రావు(చంటిబాబు) రెచ్చిపోయారు.
అసహనంతో ఊగిపోయారు. అదేవిధంగా చిత్తూరులో కూడా ఎమ్మెల్యే శ్రీనివాసులు నిలదీతకు గురయ్యారు. రేషన్ బియ్యం వాహనం రావడం లేదని చెబుతూ ఎమ్మెల్యేను మహిళలు చుట్టు ముట్టారు. చిత్తూరు నగరంలోని శరవణపురంలో బుధవారం ఆయన 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విధంగా ఎక్కడికక్కడ నిరసనలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిని సానుకూలంగా అర్థం చేసుకోవాలే కానీ ఆగ్రహంతో ఊగిపోకూడదు.
పేరుకు అధికార పార్టీనే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో నీతి తప్పి సొమ్ములు గుంజేయొచ్చు. పేరు అధికార పార్టీనే కావొచ్చు కొన్ని సార్లు పనుల విషయమై ఏక పక్ష ధోరణి పాటించవచ్చు. ఇవన్నీ ఎమ్మెల్యేల దృష్టికో, మంత్రుల దృష్టికో లేదా బాలినేని లాంటి బలమైన లీడర్ల వద్దకో తీసుకు వెళ్లడం సహజం. వాటిని పరిష్కరించాలి.
వీలున్నంత వరకూ క్షేత్ర స్థాయిలో నెలకొన్న అవినీతిని నిలువరించే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం లక్ష్యమే క్షేత్ర స్థాయిలో అవినీతి లేకుండా చేయడం..ఇదే జగన్ ఆశయం కూడా! మరి! మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయం మరిచిపోయి మురికి పాలిటిక్స్ చేస్తారేంటి అని విపక్షం మండిపడుతున్నది అందుకే...
పబ్లిక్ లో ఉన్నారు కదా ! ఆగండి ఆవేశ పడకండి.. ఆగ్రహంతో ఊగిపోకండి. మీరు అధికారంలో ఉన్నారు కనుక బాధలు చెబితే వాటికి రాజకీయ రంగు అంటించకండి. ఒకవేళ ఉద్దేశాలు అవే అయ్యాయే అనుకోండి వాటిని సైతం నిరూపించాల్సిన బాధ్యత రూలింగ్ పార్టీదే !
అంతేకానీ నీ అంతు చూస్తా ... నోర్ముయ్ .. ఇలాంటి పదాలు వాడకండి. అలానే అవంతి లాంటి వారు అయితే కుల దూషణ కూడా చేస్తున్నారు. అది ఇంకా తప్పు ! బాధితులు ఎవ్వరయినా సరే వారిని బాధను సానుకూలంగా అర్థం చేసుకోక అరుస్తాం అంటే అది కుదరని పని !